Site icon NTV Telugu

Chiranjeevi Birthday: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు అక్కడే.. హాజరుకానున్న అతిరథ మహారథులు!

Chiranjeevi Birthday

Chiranjeevi Birthday

Chiranjeevi 68th Birthday Celebrations at JRC Convention Hall in Hyderabad: ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ల తర్వాత నాలుగు దశాబ్దాలుగా సిల్వర్‌ స్క్రీన్‌ను ఏలుతున్న టాలీవుడ్ ‘మెగాస్టార్’ చిరంజీవి క్రేజ్.. ఏ మాత్రం తగ్గలేదు. థియేటర్లలో ఆయన సినిమా రిలీజ్ అయితే.. విజిల్స్‌ మోత మోగుతోంది, బాక్సాఫీస్ షేక్ అవుతోంది. ఈ వయసులో కూడా యువ హీరోలకు పోటీనిస్తూ చిరు వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికీ సూపర్ డైలాగ్‌ డెలివరీ, అదిరిపోయే స్టెప్పులు వేస్తున్న చిరుకి 67 ఏళ్లు నిండాయంటే నమ్మశక్యం కాదు. మంగళవారం (ఆగష్టు 22) చిరంజీవి తన 68వ పుట్టినరోజు జరుపుకోనున్నారు.

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజుకు ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి. దాంతో బాస్ పుట్టినరోజును ఘనంగా జరిపేందుకు ఆయన ఫ్యాన్స్‌ సిద్ధం అవుతున్నారు. ఈ ఏడాదికి సంబంధించి చిరంజీవి పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్ నగరంలోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ హాల్‌లో ఘనంగా జరగబోతున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలు కానుంది. అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో జరగబోతున్న ఈ కార్యక్రమానికి మెగా హీరోలతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు హాజరు కాబోతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అంటే ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు మాత్రమే కాదు.. తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ పండుగ రోజులా జరుపుకుంటూ ఉంటారు. అందుకే కనీవినీ ఎరుగని రీతిలో ఈసారి మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలు జరపాలని అఖిల భారత చిరంజీవి యువత నిర్ణయం తీసుకుంది. బాస్ జన్మదిన వేడుకల్లో ఆయన సతీమణి సురేఖ, నాగబాబు దంపతులు, రామ్‌ చరణ్‌ దంపతులు, వరుణ్‌ తేజ్‌, సాయి తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, నిహారిక తదితరులు పాల్గొన్నారని సమాచారం.

Also Read: Redmi K60 Ultra Price: రెడ్‌మీ నుంచి 24GB రామ్, 1TB స్టోరేజ్ స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే!

ఇటీవల చిరంజీవి కాలుకి స్వల్ప శస్త్ర చికిత్స జరిగింది. తాజాగా బాస్ నటించిన ‘భోళాశంకర్’ సినిమా డిజాస్టర్‌గా మిగిలింది. ఈ చేదు గుర్తుల నుంచి ఆయన బయటపడేందుకు మెగస్టార్‌ పుట్టినరోజు ఓ టానిక్‌లా పనిచేస్తుందని అభిమానులు భావిస్తున్నారు. పుట్టినరోజున బాస్ నుంచి కొత్త సినిమా ప్రకటన ఉంటుందని ఫాన్స్ ఆశిస్తున్నారు. మరి అభిమానులకు మెగాస్టార్ శుభవార్త అందిస్తాడో లేదో చూడాలి.

Exit mobile version