NTV Telugu Site icon

HanuMan : ట్రైలర్ రిలీజ్ పై అప్డేట్ ఇచ్చిన మేకర్స్…

Whatsapp Image 2023 10 24 At 2.03.21 Pm

Whatsapp Image 2023 10 24 At 2.03.21 Pm

యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న లేటెస్ట్ మూవీ హనుమాన్.. ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ మైథలాజికల్ సూపర్ హీరో చిత్రంలో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆ!, జాంబిరెడ్డి లాంటి విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించిన టాలెంటెడ్ డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. టీజర్ అద్భుతంగా ఉండటంతో ఈ సినిమా కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న హనుమాన్‍ సినిమాను ను రిలీజ్ చేయనున్నట్టు మూవీ యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే, సంక్రాంతికి పోటీ తీవ్రంగా ఉండటంతో ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉంటుందని టాక్ కూడా వచ్చింది. మూవీ యూనిట్ మరోసారి రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చింది. అలాగే, ట్రైలర్ గురించి కూడా అప్‍డేట్ ఇచ్చింది.దసరా సందర్భంగా హనుమాన్ సినిమాకు సంబంధించిన ఓ కొత్త పోస్టర్‌ను ప్రైమ్ షో ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్ విడుదల చేసింది. తేజా సజ్జా కోర మీసాలతో.. స్టైలిష్‍గా కనిపించారు.. ఈ పోస్టర్లో మరోసారి రిలీజ్ డేట్‍పై క్లారిటీ ఇచ్చింది మూవీ యూనిట్. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది (2024) జనవరి 12వ తేదీన హనుమాన్ చిత్రం రిలీజ్ అవుతుందని స్పష్టం చేసింది.

హనుమాన్ సినిమా ట్రైలర్‌ను అతిత్వరలో తీసుకురానున్నట్టు మేకర్స్ ట్వీట్ చేశారు.అలాగే వివిధ భాషలతో పోస్టర్లను రిలీజ్ చేశారు. హనుమాన్ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం మరియు మరాఠీలో కూడా రిలీజ్ కానుంది. అలాగే, ఇంగ్లిష్, స్పానిష్, కొరియన్, జపనీస్ మరియు చైనీస్ భాషల్లోనూ విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ట్రైలర్ రిలీజ్ డేట్ గురించి త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది.హనుమంతుడి వల్ల శక్తులు పొందే సూపర్ హీరో ‘హనుమంతు’ పాత్రను తేజ సజ్జా ఈ సినిమాలో చేస్తున్నారని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాజ్, వెన్నెల కిశోర్, సత్య ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనుదీప్ దేవ్, హరిగౌడ మరియు కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు.వచ్చే ఏడాదికి సంక్రాంతికి గుంటూరు కారం, సైంధవ్, ఫ్యామిలీ స్టార్, నా సామిరంగ మరియు ఈగల్ వంటి మరిన్ని చిత్రాలు ఉండటంతో థియేటర్లు దొరకడం కష్టమవుతుందేమో అని హనుమాన్ వాయిదా పడుతుందనే వార్తలు వినిపించాయి. అయితే, మూవీ యూనిట్ మాత్రం సంక్రాంతికే సినిమాను తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు తాజా పోస్టర్‌తో తెలిపింది..

https://x.com/Primeshowtweets/status/1716683464542650659?s=20