Site icon NTV Telugu

HanuMan : థర్డ్ సింగిల్ పై అప్డేట్ ఇచ్చిన మేకర్స్..

Whatsapp Image 2023 11 22 At 6.36.43 Pm

Whatsapp Image 2023 11 22 At 6.36.43 Pm

యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న లేటెస్ట్ మూవీ హనుమాన్..అ!, ‘కల్కి’ మరియు ‘జాంబీ రెడ్డి’ సినిమాలతో విభిన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.. ఇక ఈ మూవీ తొలి తెలుగు సూపర్ హీరో సినిమాగా రానుంది. భారతీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది.. ఇక సూపర్ హీరో సిరీస్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌ హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో అందరినీ  ఇంప్రెస్‌ చేస్తోంది. గ్లోబల్ వైడ్ గా ప్రేక్షకులను ఆకట్టుకునే హై టెక్నికల్‌ వాల్యూస్‌తో కట్‌ చేసిన విజువల్స్‌ సినిమాపై అంచనాలు భారీగా పెంచేస్తున్నాయి. కాగా రీసెంట్‌గా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ విడుదల చేయగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ అప్‌డేట్‌ను ఇచ్చారు మేకర్స్.ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్‌ను నవంబర్ 28 న విడుదల చేయనున్నట్లు చిత్రంబృందం సోషల్ మీడియాలో తెలిపింది. దీనితో పాటు హనుమాన్ నుంచి కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేసారు.ఇక ఈ చిత్రాన్ని మేకర్స్ 2024 జనవరి 12 న తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్తో సహా పలు భారతీయ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. శ్రీమతి చైతన్య సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అస్రిన్‌ రెడ్డి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా, వెంకట్‌ కుమార్‌ జెట్టీ లైన్‌ ప్రొడ్యూసర్‌గా అలాగే కుశాల్‌ రెడ్డి అసోసియేట్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. హనుమాన్‌ చిత్రానికి గౌరహరి-అనుదీప్‌ దేవ్‌ మరియు కృష్ణ సౌరభ్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో తేజ సజ్జ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుంది., వినయ్ రాయ్ విలన్గా, వరలక్ష్మి శరత్కుమార్, గెటప్ శ్రీను, సత్య, రాజ్ మరియు దీపక్ శెట్టి తదితరులు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.

 

Exit mobile version