HanuMan : థర్డ్ సింగిల్ పై అప్డేట్ ఇచ్చిన మేకర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న లేటెస్ట్ మూవీ హనుమాన్..అ!, ‘కల్కి’ మరియు ‘జాంబీ రెడ్డి’ సినిమాలతో విభిన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.. ఇక ఈ మూవీ తొలి తెలుగు సూపర్ హీరో సినిమాగా రానుంది. భారతీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది.. ఇక సూపర్ హీరో సిరీస్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన టీజర్ హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో అందరినీ ఇంప్రెస్ చేస్తోంది. గ్లోబల్ వైడ్ గా ప్రేక్షకులను ఆకట్టుకునే హై టెక్నికల్ వాల్యూస్‌తో కట్ చేసిన విజువల్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేస్తున్నాయి. కాగా రీసెంట్‌గా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ విడుదల చేయగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ అప్‌డేట్‌ను ఇచ్చారు మేకర్స్.ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్‌ను నవంబర్ 28 న విడుదల చేయనున్నట్లు చిత్రంబృందం సోషల్ మీడియాలో తెలిపింది. దీనితో పాటు హనుమాన్ నుంచి కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేసారు.ఇక ఈ చిత్రాన్ని మేకర్స్ 2024 జనవరి 12 న తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్తో సహా పలు భారతీయ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. శ్రీమతి చైతన్య సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అస్రిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, వెంకట్ కుమార్ జెట్టీ లైన్ ప్రొడ్యూసర్‌గా అలాగే కుశాల్ రెడ్డి అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. హనుమాన్ చిత్రానికి గౌరహరి-అనుదీప్ దేవ్ మరియు కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో తేజ సజ్జ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుంది., వినయ్ రాయ్ విలన్గా, వరలక్ష్మి శరత్కుమార్, గెటప్ శ్రీను, సత్య, రాజ్ మరియు దీపక్ శెట్టి తదితరులు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!