హే హనుమాన్.. నీ భూమికి నీవే రక్షకుడివి.. కబ్జాదారుల నుంచి నిన్ను నీవే కాపాడుకో అంజనీ పుత్ర అంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. హనుమాన్ దేవాలయం భూమి బిఆర్ఎస్ నాయకులు కబ్జా చేశారని అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోగా తమపైనే అక్రమ కేసులు పెట్టారంటూ ఎస్సార్ నగర్ యువకులు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళనకు దిగారు. వరంగల్ నగరంలోని 15వ డివిజన్ ఎస్ ఆర్ నగర్లో ఉన్న హనుమాన్ దేవాలయం భూమిని స్థానిక బిఆర్ఎస్ నాయకులు కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారని ఎస్సార్ నగర్ కు చెందిన యువకులు జిల్లా కలెక్టర్ తో పాటు ఆర్డిఓ, ఎంఆర్ఓ కు ఫిర్యాదు చేశారు.
Read Also: G20: జీ20 సమావేశాలపై డీజీపీ సమీక్ష.. ఈ నెల 28న ఫస్ట్ మీటింగ్
నిన్న స్థల పరిశీలకు వచ్చిన అధికారులు వివరాలను నమోదు చేసుకొని వెళ్లిపోయారు దీంతో స్థానికంగా ఉండే బి.ఆర్.ఎస్ నాయకులు రాజశేఖర్ నరసింహ తో పాటు మరికొందరు యువకులతో గొడవకు దిగారు గుర్రం మొదలవడంతో ఇరువర్గాలు ఏనుమాముల పోలీస్ స్టేషన్లో పరస్పర ఫిర్యాదు చేసుకున్నారు. ఈరోజు ఉదయం యువకులు మనస్థాపానికి గురై వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన చేపట్టారు దేవాలయం భూమిని రక్షించేంతవరకు తాము వాటర్ ట్యాంక్ దిగేది లేదని భూమిని కబ్జా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also: Minister Roja: బాలయ్యతో ఏడు సినిమాలు చేశా.. అన్‌స్టాపబుల్ షోకు వెళ్లాలని ఉంది.. కానీ..?