NTV Telugu Site icon

HanuMan : మరో ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ..

Whatsapp Image 2024 03 26 At 7.48.08 Am

Whatsapp Image 2024 03 26 At 7.48.08 Am

టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన హనుమాన్ సినిమా థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తక్కువ బడ్జెట్‍తో తెరకెక్కిన ఈ సూపర్ హీరో మూవీ.. కలెక్షన్ల సునామీ సృష్టించింది.ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో కొన్ని ట్విస్టులు వస్తూనే ఉన్నాయి. ముందుగా హనుమాన్ హిందీ వెర్షన్ జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అందుబాటులోకి వచ్చింది. తెలుగులో రూపొందిన ఈ చిత్రం ముందుగా హిందీ వెర్షన్ స్ట్రీమింగ్‍కు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, దానికి ఒక్క రోజు తర్వాత మార్చి 17వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో హనుమాన్ తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ సినిమా తమిళం, కన్నడ మరియు మలయాళం వెర్షన్‍ల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ భాషల వెర్షన్‍లలో మరో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో హనుమాన్ అందుబాటులోకి రానుంది.

హనుమాన్ సినిమా తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల వెర్షన్లు డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అడుగుపెట్టనున్నాయి. ఆ మూడు భాషల్లో ఏప్రిల్ 5వ తేదీన హాట్‍స్టార్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని డిస్నీ+ హాట్‍స్టార్  మార్చి 25 న  అధికారికంగా ప్రకటించింది.బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హనుమాన్ సినిమా తమిళ వెర్షన్ ఏప్రిల్ 5వ తేదీన స్ట్రీమింగ్‍కు వస్తుందని హాట్‍స్టార్ నేడు వెల్లడించింది. అలాగే, మలయాళం, కన్నడ, వెర్షన్‍లలోనూ రానుందని కన్ఫర్మ్ చేసింది.ఒక సినిమా మూడు ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో స్ట్రీమింగ్ అవడం అంటే అది చాలా అరుదు. అయితే, హనుమాన్ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ ప్రస్తుతం జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అందుబాటులో ఉంది. హిందీ వెర్షన్ ‘జియోసినిమా’ ఓటీటీలో కూడా స్ట్రీమ్ అవుతోంది. ఇక తమిళం, మలయాళం, కన్నడ బాషల్లో ఏప్రిల్ 5న డిస్నీ+ హాట్‍స్టార్‌లోకి రానుంది. ఇలా.. ఏకంగా మూడు ప్లాట్‍ఫామ్‍ల్లో హనుమాన్ స్ట్రీమింగ్‍ అవుతుంది.