HanuMan : మరో ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన హనుమాన్ సినిమా థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సూపర్ హీరో మూవీ.. కలెక్షన్ల సునామీ సృష్టించింది.ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో కొన్ని ట్విస్టులు వస్తూనే ఉన్నాయి. ముందుగా హనుమాన్ హిందీ వెర్షన్ జియోసినిమా ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి వచ్చింది. తెలుగులో రూపొందిన ఈ చిత్రం ముందుగా హిందీ వెర్షన్ స్ట్రీమింగ్కు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, దానికి ఒక్క రోజు తర్వాత మార్చి 17వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో హనుమాన్ తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్కు వచ్చింది. ఈ సినిమా తమిళం, కన్నడ మరియు మలయాళం వెర్షన్ల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ భాషల వెర్షన్లలో మరో ఓటీటీ ప్లాట్ఫామ్లో హనుమాన్ అందుబాటులోకి రానుంది.
హనుమాన్ సినిమా తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల వెర్షన్లు డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అడుగుపెట్టనున్నాయి. ఆ మూడు భాషల్లో ఏప్రిల్ 5వ తేదీన హాట్‌స్టార్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్కు రానుంది. ఈ విషయాన్ని డిస్నీ+ హాట్‌స్టార్ మార్చి 25 న అధికారికంగా ప్రకటించింది.బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హనుమాన్ సినిమా తమిళ వెర్షన్ ఏప్రిల్ 5వ తేదీన స్ట్రీమింగ్కు వస్తుందని హాట్‌స్టార్ నేడు వెల్లడించింది. అలాగే, మలయాళం, కన్నడ, వెర్షన్లలోనూ రానుందని కన్ఫర్మ్ చేసింది.ఒక సినిమా మూడు ఓటీటీ ప్లాట్ఫామ్ల్లో స్ట్రీమింగ్ అవడం అంటే అది చాలా అరుదు. అయితే, హనుమాన్ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ ప్రస్తుతం జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉంది. హిందీ వెర్షన్ ‘జియోసినిమా’ ఓటీటీలో కూడా స్ట్రీమ్ అవుతోంది. ఇక తమిళం, మలయాళం, కన్నడ బాషల్లో ఏప్రిల్ 5న డిస్నీ+ హాట్స్టార్లోకి రానుంది. ఇలా.. ఏకంగా మూడు ప్లాట్ఫామ్ల్లో హనుమాన్ స్ట్రీమింగ్ అవుతుంది.
Also Read
- Anushka-Virat: గ్లామర్, క్రికెట్ ప్రపంచానికి దూరంగా.. ఆధ్యాత్మిక బాటలో విరాట్ కోహ్లీ-అనుష్క దంపతులు
- Harmanpreet Kaur: కెప్టెన్సీ లేకపోతేమి.. బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేయడమే నా లక్ష్యం..! హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు.!
- NZ A vs IND A: దేవదత్ పడిక్కల్ సూపర్ సెంచరీ.. ఓటమి అంచులనుండి బయటపడ్డ ఇండియా ‘A’
- Madhya Pradesh: నర్మదా నది తీరంలో వేలాది ఓటర్ ఐడీ కార్డులు.. అసలేం జరిగింది?
Get Ready to watch one of India’s biggest blockbuster HANUMAN from April 5th in TAMIL on #DisneyplusHotstarTamil @PrasanthVarma @tejasajja123#HanuManEverywhere@Niran_Reddy @Actor_Amritha @varusarath5 @VinayRai1809 @GowrahariK @Primeshowtweets @ThePVCU @Primeshowtweets pic.twitter.com/8FqAV49NW6
— JioHotstar Tamil (@JioHotstartam) March 25, 2024
తాజావార్తలు
-
HP Star Book Air 14: HP Star Book Air 14 ల్యాప్‌టాప్ లాంచ్.. OLED టచ్‌స్క్రీన్, 42.5 గంటల బ్యాటరీ బ్యాకప్!
-
Anushka-Virat: గ్లామర్, క్రికెట్ ప్రపంచానికి దూరంగా.. ఆధ్యాత్మిక బాటలో విరాట్ కోహ్లీ-అనుష్క దంపతులు
-
Team India History: టీ20 క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు.. తొలి జట్టుగా టీమిండియా!
-
Harmanpreet Kaur: కెప్టెన్సీ లేకపోతేమి.. బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేయడమే నా లక్ష్యం..! హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు.!
-
RBI Data Centre: భువనేశ్వర్‌లో RBI డేటా సెంటర్ ప్రారంభించిన ప్రధాని మోడీ.. సైబర్ సెక్యూరిటీకి కీలక అడుగు
ట్రెండింగ్
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!