Prashanth Varma : బాధలో ఉన్నపుడు నెట్ ఫ్లిక్స్ ఓపెన్ చేసి కాటేరమ్మ సీన్ చూస్తా : ప్రశాంత్ వర్మ
- అవును మగాళ్లు సింపుల్ జీవులన్న ప్రశాంత్ వర్మ
- బాధలో ఉంటే కాటేరమ్మ సీన్ చూస్తామంటూ ప్రకటన
- త్వరలో ప్రభాస్ తో ప్రశాంత్ సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prashanth Varma : ప్రశాంత్ వర్మ తన మొదటి సినిమా నుండి కొత్త కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. మొన్న సంక్రాంతికి హనుమాన్ సినిమాతో వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. అలాగే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ప్రకటించడంతో ఆయన సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ఇప్పటికే ఐదు చిత్రాల గురించి ప్రకటించాడు. వాటిలో కొన్నింటికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా, మరికొన్ని అతని పర్యవేక్షణలో ఉన్నాయి. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటించిన దేవకి నందన వాసుదేవ చిత్రం నవంబర్ 22న విడుదల కానుంది.ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ కథ అందించారు. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి బోయపాటి శ్రీనివాస్ అతిథిగా వచ్చారు.
Read Also:AlluArjun : ‘పుష్ప-2’ ట్రైలర్‌పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే కామెంట్స్ వైరల్!
Also Read
తాజాగా ప్రశాంత్ వర్మ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా.. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్” బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఒకో యాక్షన్ బ్లాక్ కి సెపరేట్ క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఓటీటీలోకి వచ్చిన తర్వాత అయితే సలార్ కి రిపీట్ వ్యూస్ వచ్చాయి అనే చెప్పుకోవాలి. ఆ సినిమాలోని కాటేరమ్మ ఫైట్ సీక్వెన్స్ అయితే ఒక వ్యసనంలా ఫ్యాన్స్ సహా ఇతర ఆడియెన్స్ కూడా చూస్తున్నారు. మరి మెన్ ఏదన్నా బాధలో ఉన్నపుడు నెట్ ఫ్లిక్స్ ఓపెన్ చేసి కాటేరమ్మ సీన్ చూసి హ్యాపీ అవుతారంటూ వచ్చిన ఓ మీమ్ కి హను మాన్ దర్శకుడు సపోర్ట్ ఇచ్చారు. అవును అది నిజమే మగవాళ్ళు సింపుల్ జీవులు అన్నట్లుగా తెలిపాడు. మరి ఈ మధ్య ప్రభాస్ కి రిలేటెడ్ పోస్ట్ లు ప్రశాంత్ వర్మ నుంచి చాలానే వస్తున్నాయి. ఆల్రెడీ ప్రభాస్ తో ఓ ఊహించని సినిమా తనతో ఉందని స్ట్రాంగ్ రూమర్స్ కూడా ఉన్నాయి. మరి ఇలా మెల్లగా ఈ క్రేజీ కాంబినేషన్ పై క్లారిటీ వస్తుందేమో చూడాలి.
Yes!
Men are simple creatures! https://t.co/yfMfogM0f6
— Prasanth Varma (@PrasanthVarma) November 21, 2024
తాజావార్తలు
-
Charmila Nalluri Background : ట్రెండింగ్ యాంకర్ చర్మిల బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
-
WTC Final: WTC ఫైనల్ రేసులో భారత్.. ఇదొక్కటి చేస్తే కప్ ఇండియాదే..
-
Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
-
Nara Lokesh: మంత్రి లోకేష్‌తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
-
E20 Petrol: ఈ20 పెట్రోల్‌పై కీలక ప్రకటన చేసిన కేంద్రం
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!