HanuMan : ‘హనుమాన్ ‘ కలెక్షన్స్ జాతర..15 రోజుల్లోనే ‘250’ కోట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ సూపర్ హీరో మూవీ ‘హనుమాన్ ‘. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీకి ప్రేక్షకుల నుండి విపరీతమైన స్పందన వస్తుంది.హనుమాన్ మూవీలో హీరో తేజ సజ్జతో పాటు అమృతా అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్ మరియు వినయ్ రాయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇప్పటికీ 3 వారాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగా కలెక్షన్స్ సాధిస్తుంది. ఈ సినిమా రిలీజ్ అయి 15 రోజులలోనే రూ. 250 కోట్ల కలెక్షన్లను సాధించినట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. ఈ వారంలో కొత్త తెలుగు సినిమాల రిలీజ్ లు కూడా లేకపోవడంతో హనుమాన్ మూవీ త్వరలోనే రూ. 300 కోట్ల మార్క్ ను చేరుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా వేస్తున్నారు..
హనుమాన్ మూవీకి కొనసాగింపుగా జై హనుమాన్ మూవీ ఉంటుందని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెలియజేసిన విషయం తెలిసిందే..ఇక ఇటీవల అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ జై హనుమాన్ మూవీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల నుంచి హనుమాన్ మూవీ కు అపారమైన ప్రేమాభిమానాలు, మద్దతు లభించినందుకు కృతజ్ఞతలు. ఈ సందర్భంగా కొత్త ప్రయాణానికి నాంది పలుకుతున్నాను. రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ మొదలవుతుంది” అని ప్రశాంత్ పేర్కొన్నారు.జై హనుమాన్ మూవీ 2025 న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. అలాగే సినిమాలో ఒక స్టార్ హీరో రాముడి పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. హనుమాన్ మూవీ కంటే జై హనుమాన్ మూవీ మరింత విజువల్ వండర్ గా ఉండేట్లు దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్లాన్ చేస్తున్నారు..
Also Read
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
తాజావార్తలు
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
-
Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
-
PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ ‘ఆన్లైన్ ఫిర్యాదుల’ అస్త్రం.!
-
Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
-
Live In Relationships: సహజీవనం వివాహంతో సమానమే.. జంటలకు హైకోర్టు భరోసా
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?