My Name is Shruthi : మరో ఓటీటీలోకి వచ్చేస్తున్న హన్సిక నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హన్సిక హీరోయిన్‌గా నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ మై నేమ్ ఈజ్ శృతి..నవంబర్ 17న థియేటర్లలో ఈ మూవీ రిలీజైంది. అదే రోజు పోటీగా పలు సినిమాలు విడుదల కావడంతో మై నేమ్ ఈజ్ శృతి కలెక్షన్స్‌పై ఎఫెక్ట్ చూపించింది. ఆశించిన స్థాయిలో వసూళ్లను అయితే రాబట్టలేకపోయింది.. సందీప్‌కిషన్ హీరోగా 2019లో రూపొందిన తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ తర్వాత టాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చిన హన్సిక. మై నేమ్ ఈజ్ శృతి మూవీతోనే దాదాపు నాలుగేళ్ల విరామం తరువాత తిరిగి టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది.మై నేమ్ ఈజ్ శృతి మూవీతో శ్రీనివాస్ ఓంకార్ డైరెక్టర్‌గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. స్కిన్ మాఫియా అనే కొత్త పాయింట్‌తో దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు.ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమంగ్ అవుతోంది.తాజాగా ఆహా ఓటీటీలోకి కూడా హన్సిక మూవీ రాబోతోంది.
మై నేమ్ ఈజ్ శృతి ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఆహా అఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది.బుధవారం (ఫిబ్రవరి 28) నుంచి ఈ మూవీ ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీలో హన్సిక యాక్టింగ్‌తో పాటు కాన్సెప్ట్ కూడా బాగుందనే పేరొచ్చిన కమర్షియల్‌గా మాత్రం సినిమా వర్కవుట్ కాలేదు.మై నేమ్ ఈజ్ శృతి సినిమాలో మురళీశర్మ, నరేన్, పూజా రామచంద్రన్ మరియు ప్రవీణ్ కీలక పాత్రలు పోషించారు.మై నేమ్ ఈజ్ శృతి తర్వాత తెలుగులో 105 మినిట్స్ పేరుతో హన్సిక ఓ సినిమా చేసింది. సింగిల్ క్యారెక్టర్‌తో ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఆ మూవీ కూడా హన్సికకు నిరాశనే మిగిల్చింది. ప్రస్తుతం తమిళంలో రౌడీ బేబీ మరియు గార్డియన్‌తో పాటు మ్యాన్ అనే సినిమాలో నటిస్తుంది.2022 డిసెంబర్‌లో తన చిరకాల ప్రియుడు సోహైల్ కథురియాను పెళ్లిచేసుకుంది.. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఈ జంట పెళ్లి వేడుక జరిగింది. హన్సిక తన వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తూనే మరోవైపు సినిమాలలో కూడా నటిస్తుంది.
Also Read
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!