NTV Telugu Site icon

Hansika Movie : సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన హన్సిక మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?

Hasika

Hasika

టాలీవుడ్ హీరోయిన్ హన్సిక గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. దేశముదురు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.. ఆ తర్వాత హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ వచ్చింది.. తెలుగు గత కొంతకాలంగా సక్సెస్ సినిమా లేక పోవడంతో తమిళ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.. అక్కడ వరుస సినిమాలతో దూసుకుపోతుంది.. రీసెంట్ గా పెళ్లి చేసుకున్న హన్సిక ఇప్పుడు వైవిధ్యమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ నటిస్తుంది..

ఇటీవల ఆమె ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్‌, హారర్‌ మూవీ 105 మినిట్స్‌. ఈ సినిమాను రాజు దుస్సా దర్శకత్వం వహించిగా, బొమ్మక్‌ శివ నిర్మించారు.. ఈ సినిమా మొత్తం హన్సిక మాత్రం కనిపిస్తుంది.. అదే సినిమాను ముందుకు నడిపిస్తుంది.. హన్సిక నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఎలాంటి పాత్రలో అయిన జీవించి నటిస్తుంది.. ఈ సినిమాలో కూడా 34 నిమిషాల సీన్ సింగిల్‌ టేక్‌లో పూర్తి చేసింది. అలా ఎన్నో పెద్ద సన్నివేశాల్లో కట్‌ చెప్పకుండా అలవోకగా నటించేసింది..

ఇకపోతే ఈ జనవరి 26 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఇప్పుడు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తుంది. ఎటువంటి ప్రకటన లేకుండా అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజైంది. కాకపోతే రెంట్‌ పద్ధతిలో అందుబాటులో ఉంది.. అతి తక్కువ ధరకే అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను చూడొచ్చు..ఈ సినిమాలో జాను పాత్రలో హన్సిక నటించింది.. థ్రిల్లింగ్ సన్నివేశాలు మనుషులను భయపెడతాయి.. ఆ సీన్స్ గురించి మరింత తెలుసుకోవాలంటే ఓటీటీ చూసేయ్యండి..