NTV Telugu Site icon

Hansika Marriage: నేడే ‘దేశముదురు’ భామ పెళ్లి.. అతిథులు ఎవరో తెలుసా..?

Hansika Motwani

Hansika Motwani

Hansika Marriage: బాలనటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది హన్సిక. చిన్నప్పుడే రస్నా యాడ్‎లో కనిపించి మెప్పించింది. ఆ తర్వాత ‘దేశముదురు’ చిత్రంతో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. వరుసగా తమిళ, కన్నడ చిత్రాల్లో నటించి దక్షిణాదిలో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. హన్సిక ఆదివారం పెళ్లి బంధంతో కొత్త జీవితంలోకి ప్రవేశిస్తోంది. తన సహచరుడు సోహైల్ ను హన్సిక పెళ్లి చేసుకోనుంది. ఇందుకు జైపూర్ లోని ఓ రాజకోటలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరగనుంది. అయితే, తన పెళ్లిలో పాల్గొనేందుకు కొంతమంది స్పెషల్ అతిథులకు కూడా హన్సిక ప్రత్యేక ఇన్విటేషన్ పంపింది. అత్యంత వైభవంగా రాజకోటలో జరిగే పెళ్లికి పెద్ద సెలబ్రిటీలు వస్తారనుకోవడం సహజమే కానీ ఇక్కడ హన్సిక ఇన్విటేషన్ పంపించిన స్పెషల్ గెస్ట్ లు పేద చిన్నారులను కావడం విశేషం.

Read Also: Hyper Aadi: హైపర్ ఆదికి పెళ్లయ్యిందా? షాక్ అవుతున్న అభిమానులు

హన్సిక తరచూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంది. పలు ఎన్జీవోలతో కలిసి పేద చిన్నారులకు సాయం అందిస్తోంది. ఈ క్రమంలోనే తన పెళ్లికి అలాంటి కొందరు చిన్నారులకు సైతం ఇన్విటేషన్లను పంపించింది. పెళ్లికి తమని ఆహ్వానించిన హన్సికకు ధన్యవాదాలు చెబుతూ సదరు చిన్నారులు చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా.. వివాహ వేదిక పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న పేద చిన్నారులకు ఈ రోజు తన పెళ్లి భోజనాన్ని పంపించనుంది హన్సిక. కాగా, పెళ్లికి ముందు జరిగే మెహందీ, సంగీత్ లో కాబోయే దంపతులు హన్సిక, సోహైల్ ఎంతో ఉత్సాహంగా గడిపారు. సంగీత్ లో ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ఆ వీడియోలను హన్సిక సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.

Show comments