Site icon NTV Telugu

Hansika: ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న నటి హన్సిక..

Hansika

Hansika

ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన పవిత్ర పుణ్య క్షేత్రం ఇంద్రకీలాద్రి పై కొలువైన దుర్గమ్మ ఆలయం.. కోరిన కోరికలు తీర్చే అమ్మగా భక్తులు విశ్వసిస్తారు.. సినీ, రాజకీయ ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు.. తాజాగా బాలివుడ్ బ్యూటి హీరోయిన్ హన్సిక బుధవారం ఉదయం ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకుంది..

అమ్మవారి ఆలయానికి వచ్చిన హన్సికకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం పొందారు. అలాగే హన్సికకు అమ్మవారి చిత్రపటాన్ని అన్న ప్రసాదాన్ని ఆలయ అధికారులు అందజేశారు. దర్శనం అనంతరం హన్సిక మీడియాతో మాట్లాడింది..

అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు హన్సిక. గాజుల అలంకరణలో అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ”మై నేమ్ ఇస్ శృతి” సినిమాలో నటిస్తున్నారు.. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా విజయవాడ వచ్చినట్లు హన్సిక తెలిపింది. ఈ సినిమా నవంబర్ 17వ తేదీన వరల్డ్ వైస్‌గా నా చిత్రం రిలీజ్ కానుంది. ప్రేక్షకులందరూ నా చిత్రాన్ని జనాలు ఆదరించాలని అమ్మవారిని కోరుకున్నాను అని హన్సిక తెలిపారు.. ఇందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

 

 

 

Exit mobile version