NTV Telugu Site icon

Hansika 105 Minutes : ఇంటర్వెల్ లేకుండా థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న హన్సిక 105 మినిట్స్..

Whatsapp Image 2024 01 25 At 10.31.38 Am

Whatsapp Image 2024 01 25 At 10.31.38 Am

ఏ సినిమాకు అయినా కానీ ఇంటర్వెల్  కచ్చితంగా ఉంటుంది..కానీ ఇంటర్వెల్  లేకుండా వచ్చిన సినిమాలు చాలా అరుదు. ప్రస్తుతం యాపిల్ బ్యూటీ హన్సిక నటిస్తున్న లేటెస్ట్ మూవీ 105 మినిట్స్.. ఈ సినిమాను ఇంటర్వెల్ లేకుండా రిలీజ్ చేయనున్నట్లు ప్రొడ్యూసర్ తెలిపారు..కేవలం సింగిల్ క్యారెక్టర్‌తో సింగిల్ షాట్‌లో ప్రయోగాత్మకంగా రూపొందిన ఈ మూవీ జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు రాజు దుస్సా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా లెంగ్త్ గంట నలభై ఐదు నిమిషాలు మాత్రమే ఉండనుందని సమాచారం.. అందుకే ఇంటర్వెల్  లేకుండా సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తోన్నట్లు నిర్మాత బొమ్మక్ శివ తెలిపారు..105 మినిట్స్ మూవీని ఇంటర్వెల్ లేకుండానే షూట్ చేశామని ఆయనతెలిపారు.. కానీ థియేటర్ మేనేజ్మెంట్ వాళ్ళ ఇష్టం మేరకు ఇంటర్వెల్ ఇస్తే ఇవ్వచ్చు అని ప్రొడ్యూసర్ తెలిపారు.

ఈ సినిమా మొత్తం ఒకటే క్యారెక్టర్‌ ఉంటుంది. హన్సిక తప్ప మరో పాత్ర స్క్రీన్‌పై కనిపించదని నిర్మాత అన్నారు.. అయితే బ్యాక్‌గ్రౌండ్‌లో మరొకొరి వాయిస్ వినిపిస్తుంది. ఆ వాయిస్ కోసం పాన్ ఇండియన్ లెవెల్‌లో గుర్తింపును తెచ్చుకున్న హిందీ నటుడిని కలిసాము.. అతడి వాయిస్ స్పెషల్ అట్రాక్షన్‌గా ఉంటుందని నిర్మాత అన్నారు.. గ్లామర్ డాల్‌ పాత్రలకు భిన్నంగా హన్సిక లోని యాక్టింగ్ టాలెంట్‌ను పూర్తిస్థాయిలో బయటపెట్టే మూవీ ఇదని బొమ్మక్ తెలిపారు.హన్సిక గారి కంటే ముందు వేరే హీరోయిన్‌తో సినిమా చేయాలని అనుకున్నామని ఆయన తెలిపారు.. కానీ తెలుగు మరియు తమిళ భాషల్లో హన్సికకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని కథ చెప్పగానే ఆమె ఈ సినిమాను అంగీకరించారు అని అన్నారు.జనవరి 26న తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాం.. పాన్ ఇండియన్ లెవెల్‌లో మిగిలిన భాషల్లో రిలీజ్ చేసే ఆలోచనలో కూడా ఉన్నామని ఆయన అన్నారు.. సింగిల్ క్యారెక్టర్ అయినా సినిమా బడ్జెట్ మాత్రం మూడున్నర కోట్లు దాటినట్లు నిర్మాత తెలిపారు