Hansika 105 Minutes : ఇంటర్వెల్ లేకుండా థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న హన్సిక 105 మినిట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏ సినిమాకు అయినా కానీ ఇంటర్వెల్ కచ్చితంగా ఉంటుంది..కానీ ఇంటర్వెల్ లేకుండా వచ్చిన సినిమాలు చాలా అరుదు. ప్రస్తుతం యాపిల్ బ్యూటీ హన్సిక నటిస్తున్న లేటెస్ట్ మూవీ 105 మినిట్స్.. ఈ సినిమాను ఇంటర్వెల్ లేకుండా రిలీజ్ చేయనున్నట్లు ప్రొడ్యూసర్ తెలిపారు..కేవలం సింగిల్ క్యారెక్టర్‌తో సింగిల్ షాట్లో ప్రయోగాత్మకంగా రూపొందిన ఈ మూవీ జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు రాజు దుస్సా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా లెంగ్త్ గంట నలభై ఐదు నిమిషాలు మాత్రమే ఉండనుందని సమాచారం.. అందుకే ఇంటర్వెల్ లేకుండా సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తోన్నట్లు నిర్మాత బొమ్మక్ శివ తెలిపారు..105 మినిట్స్ మూవీని ఇంటర్వెల్ లేకుండానే షూట్ చేశామని ఆయనతెలిపారు.. కానీ థియేటర్ మేనేజ్మెంట్ వాళ్ళ ఇష్టం మేరకు ఇంటర్వెల్ ఇస్తే ఇవ్వచ్చు అని ప్రొడ్యూసర్ తెలిపారు.
ఈ సినిమా మొత్తం ఒకటే క్యారెక్టర్ ఉంటుంది. హన్సిక తప్ప మరో పాత్ర స్క్రీన్‌పై కనిపించదని నిర్మాత అన్నారు.. అయితే బ్యాక్‌గ్రౌండ్‌లో మరొకొరి వాయిస్ వినిపిస్తుంది. ఆ వాయిస్ కోసం పాన్ ఇండియన్ లెవెల్లో గుర్తింపును తెచ్చుకున్న హిందీ నటుడిని కలిసాము.. అతడి వాయిస్ స్పెషల్ అట్రాక్షన్‌గా ఉంటుందని నిర్మాత అన్నారు.. గ్లామర్ డాల్ పాత్రలకు భిన్నంగా హన్సిక లోని యాక్టింగ్ టాలెంట్‌ను పూర్తిస్థాయిలో బయటపెట్టే మూవీ ఇదని బొమ్మక్ తెలిపారు.హన్సిక గారి కంటే ముందు వేరే హీరోయిన్‌తో సినిమా చేయాలని అనుకున్నామని ఆయన తెలిపారు.. కానీ తెలుగు మరియు తమిళ భాషల్లో హన్సికకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని కథ చెప్పగానే ఆమె ఈ సినిమాను అంగీకరించారు అని అన్నారు.జనవరి 26న తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాం.. పాన్ ఇండియన్ లెవెల్లో మిగిలిన భాషల్లో రిలీజ్ చేసే ఆలోచనలో కూడా ఉన్నామని ఆయన అన్నారు.. సింగిల్ క్యారెక్టర్ అయినా సినిమా బడ్జెట్ మాత్రం మూడున్నర కోట్లు దాటినట్లు నిర్మాత తెలిపారు
Also Read
- Giacomo Filibeck: కాంగ్రెస్‌కు మద్దతుగా ‘ఓట్ చోర్’ నినాదాలు.. ఇటలీ నేతను బ్లాక్‌లిస్ట్ చేసిన ఫిలిప్పీన్స్!
- AP Govt: ఏపీలో టెక్నాలజీ విప్లవం.. మూడు నూతన పాలసీలకు ఉత్తర్వులు జారీ..
- Kulgam Encounter: కుల్గాం దాడి సూత్రధారి లతీఫ్ భట్ హతం.. ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి
- Gully Cricket: చిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
తాజావార్తలు
-
Keerthy Suresh: స్పెషల్ సాంగ్ నుంచి స్టార్ హీరోల దాకా.. పెళ్లి తర్వాత కీర్తి సురేష్ రేంజ్ మామూలుగా లేదుగా!
-
Giacomo Filibeck: కాంగ్రెస్‌కు మద్దతుగా ‘ఓట్ చోర్’ నినాదాలు.. ఇటలీ నేతను బ్లాక్‌లిస్ట్ చేసిన ఫిలిప్పీన్స్!
-
Box Office Crisis: శుక్రవారం వస్తున్నాయి.. ఆదివారమే వెళ్లిపోతున్నాయి! చిన్న సినిమాలకు అసలేమైంది?
-
AP Govt: ఏపీలో టెక్నాలజీ విప్లవం.. మూడు నూతన పాలసీలకు ఉత్తర్వులు జారీ..
-
Kulgam Encounter: కుల్గాం దాడి సూత్రధారి లతీఫ్ భట్ హతం.. ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి
ట్రెండింగ్
-
Gully Cricket: చిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!