NTV Telugu Site icon

Israel Hamas War: హమాస్‌ వెస్ట్‌ బ్యాంక్‌ కమాండర్‌ హతం

Hae

Hae

హమాస్-ఇజ్రాయెల్ మధ్య ఓ వైపు కాల్పుల విరమణ చర్చలు జరుగుతుండగానే.. ఇంకోవైపు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గత ఆరు నెలలకు పైగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకరమైన యుద్ధం సాగుతోంది. ఇప్పటికే గాజా సర్వనాశనం అయింది. అయినా కూడా హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. అయితే ఈ మధ్య హమాస్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణపై మధ్యవర్తులు చర్చలు జరుపుతుండగా… తాజాగా ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో హమాస్‌ వెస్ట్‌ బ్యాంక్‌ కమాండర్‌ ఆలా శ్రేతేహ్‌ హతమయ్యాడు. ఈమేరకు హమాస్ ఆదివారం ప్రకటించింది.

ఇది కూడా చదవండి: Pawan Kalyan: ముద్రగడ పద్మనాభంను, ఆయన కుమార్తె క్రాంతిని కలుపుతా

ఇజ్రాయెల్‌- హమాస్‌ల మధ్య కాల్పుల విరమణ చర్చల్లో పురోగతి కనిపించినట్లు వార్తలు వచ్చిన వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. టెల్‌అవీవ్‌ బలగాలు జరిపిన కాల్పుల్లో హమాస్‌ వెస్ట్‌ బ్యాంక్‌ కమాండర్‌ హతమయ్యాడు. మొత్తం నలుగురు మృతి చెందగా.. వారిలో తమ వెస్ట్ బ్యాంక్ కమాండర్ ఆలా శ్రేతేహ్‌ (45) ఉన్నట్లు హమాస్‌ ధ్రువీకరించింది. అతడు 2002- 2016 మధ్యకాలంలో ఇజ్రాయెల్‌లో జైలు శిక్ష అనుభవించాడు. వెస్ట్ బ్యాంక్‌లోని తుల్కరేమ్ ప్రాంతంలో తమ దళాలు, ఉగ్రవాదుల మధ్య 12 గంటలపాటు ఎదురు కాల్పులు జరిగాయని.. ఈ క్రమంలోనే నలుగురు మరణించినట్లు ఐడీఎఫ్‌ వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Amit Shah: తెలంగాణలో ఓటు షేర్ పెరిగింది.. 10 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తున్నాం