Nasser Musa Killed: హమాస్ కీలక నేత, మిలిటరీ కంట్రోల్ విభాగాధిపతి నాసర్ మూసా ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మృతి చెందారు. నాసర్ మూసా మృతిపై ఇజ్రాయెల్ రక్షణ దళం తాజాగా ప్రకటన విడుదల చేసింది. గాజాపై తాము ఇటీవల చేసిన దాడుల్లో హమాస్ సీనియర్ నేత, మిలిటరీ కంట్రోల్ విభాగం అధిపతి నస్సర్ మూసా మరణించినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం (IDF) ప్రకటించింది. దాడికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
READ MORE: Constable Kanakam Review: కానిస్టేబుల్ కనకం రివ్యూ
సదరన్ కమాండ్ నాయకత్వంలో..
సదరన్ కమాండ్ నాయకత్వంలో ఖాన్ యూనిస్ ప్రాంతంలో చేసిన దాడుల్లో హమాస్ సీనియర్ నేత, హమాస్ సైనిక నియంత్రణ విభాగానికి అధిపతిగా నాసర్ మూసా మృతి చెందినట్లు ధ్రువీకరించింది. ఇజ్రాయెల్ దళాలు, పౌరులపై దాడుల నిర్వహణకు సంబంధించిన విషయాల్లో ఆయన హమాస్ సైనికులకు శిక్షణ ఇచ్చేవాడని, హమాస్ బ్రిగేడ్ కమాండర్ మహమ్మద్‌కు సన్నిహిత అనుచరుడిగానూ కొనసాగాడని ఐడీఎఫ్ పేర్కొంది. రఫా బ్రిగేడు సైనిక నిఘా, పరిశీలన నెట్వర్క్‌కు సైతం మూసా అధిపతిగా పని చేశాడని తెలిపింది. అతడి మృతితో హమాస్ ఉగ్రవాద కార్యకలాపాలు, సామర్థ్యాలు మరింత బలహీనపడే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేసింది. గాజా అంతటా ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా భూ, వైమానిక దాడులు కొనసాగుతున్నాయని పేర్కొంది.
యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి 61,700లపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తమ పౌరులకు ఆహార సరఫరా, ఇతర సహాయం అందకుండా ఇజ్రాయెల్ పలు సంస్థలను అడ్డుకుంటున్నట్లు ఆరోపించింది. ప్రజలకు తగిన సహాయం అందించాల్సిందిగా అంతర్జాతీయ సంస్థలను కోరింది. ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ ఖండించింది.
READ MORE: Nagaland Governor: నాగాలాండ్ గవర్నర్ మృతి.. ఎవరీ గణేశన్..!
