Site icon NTV Telugu

Iceland: ఐస్‌లాండ్ అధ్యక్షురాలిగా ఎన్నికైన ‘హల్లా టోమస్‌డోత్తిర్’..

Iceland

Iceland

బి టీమ్ కంపెనీ సీఈఓ, వ్యాపారవేత్త అయిన హల్లా టోమస్‌డోత్తిర్ ఐస్‌లాండ్ యొక్క ఏడవ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఇక ఈమె ఆగస్టు 1న గ్వానా జోహన్నెసన్ నుండి బాధ్యతలు స్వీకరించనున్నారని అక్కడి మీడియా నివేదించింది. 1980లో ప్రజాస్వామ్యయుతంగా అధ్యక్షురాలిగా ఎన్నికైన ప్రపంచంలోనే తొలి మహిళగా గుర్తింపు పొందిన విగ్డిస్ ఫిన్‌బోగాడోత్తిర్ తర్వాత ఆ పదవిని చేపట్టిన రెండో మహిళ టోమస్‌డోత్తిర్ గా రికార్డ్ సృష్టించింది.

Afghanistan: నదిని దాటుతుండగా పడవ బోల్తా.. 20 మంది దుర్మరణం..

ఇందుకు జరిగిన ఎన్నికలలో హల్లా టోమస్‌డోట్టిర్‌ కు 34.3 శాతం ఓట్లు రాగా, ఐస్‌లాండ్ మాజీ ప్రధాని కత్రినా జాకోబ్స్‌డోట్టిర్‌ కు 25.2 శాతం ఓట్లు మాత్రమే లభించాయని లోకల్ మీడియా నివేదించింది. డైరెక్టర్ జనరల్ హల్లా హ్రుండ్ లోగాడోట్టిర్ 15.1 శాతంతో తర్వాతి స్థానంలో ఉండగా, హాస్యనటుడు జోన్ గ్నార్, ప్రొఫెసర్ బల్దుర్ థోర్హాల్సన్ యూ వరుసగా నాలుగు, ఐదవ స్థానాల్లో నిలిచారు.

Cyber Crime: 9 కోట్లు మోసపోయిన వ్యాపారవేత్త.. వివరాలు ఇలా..

ఈ సందర్బంగా కాట్రిన్ జాకోబ్స్‌డోట్టిర్ మాట్లాడుతూ.. హల్లా టోమస్‌డోట్టిర్ విజయం స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు., నేను ఆమెను అభినందించాలనుకుంటున్నాను., ఆమె మంచి అధ్యక్షురాలు అవుతుందని నాకు తెలుసునని ఆయన అన్నారు.

Exit mobile version