Site icon NTV Telugu

Half Day Schools : విద్యార్థులకు అలర్ట్‌.. తెలంగాణ ఒంటిపూట బడులు షెడ్యూల్‌ రిలీజ్‌

Half Day Schools

Half Day Schools

తెలంగాణలోని విద్యార్థులకు విద్యాశాఖ శుభవార్త చెప్పింది. ఈ నెల 15వ తేదీ నుంచి ఒంటి పూట బడులు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణాలోని విద్యాసంస్థలు ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశించింది. అయితే. ఏప్రిల్ 25నుండి పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్లాసులు నిర్వహించనున్నారు. ఒంటిపూట బడి సమయాల్లో అన్ని పాఠశాలల్లో స్వచ్ఛమైన తాగునీరు అందేలా చూడాలని విద్యాశాఖ అధికారులు ఆదేశించారు.

Also Read : Renuka Chowdhury : లిక్కర్ కేసుకి రాజకీయ కక్ష్యలని రంగులు పూస్తున్నారు

ఇదిలా ఉంటే.. ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. టెన్త్‌ పరీక్షలు ఆరు పేపర్లకు కుదించింది విద్యాశాఖ. వంద శాతం సిలబస్‌తో పరీక్షల నిర్వహణ ఉంటుందని, ప్రతీ పరీక్షకు 3 గంటల సమయం కేటాయించామని విద్యాశాఖ తెలిపింది. టెన్త్‌ విద్యార్థులకు స్పెషల్‌ క్లాసులు ఉంటాయని స్పష్టం చేశారు.

Also Read : Sajjala Ramakrishna Reddy: జగన్‌వి విప్లవాత్మక సంస్కరణలు.. రాజకీయ సాధికారత దిశగా అడుగులు..

Exit mobile version