Site icon NTV Telugu

Haldwani Violence: హల్ద్వానీలో తాత్కాలికంగా కర్ఫ్యూ సడలింపు..

Haldwani

Haldwani

Curfew relaxed: ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో నైనిటాల్ జిల్లాలోని బన్‌భూల్‌పురా పట్టణంలో ‘అక్రమ’ మదర్సా కూల్చివేతపై హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో విధించిన కర్ఫ్యూ తాత్కాలిక సడలించింది. గౌజాజలి, రైల్వే బజార్, ఎఫ్‌సిఐ గోడౌన్‌తో సహా కొన్ని ప్రాంతాలలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంటుందని జిల్లా మేజిస్ట్రేట్ వందనా సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన బన్‌భూల్‌పురాలో కర్ఫ్యూ ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రెండు గంటల పాటు సడలించబడుతుంది అని పేర్కొన్నారు.

Read Also: Yash : అసిస్టెంట్ ఇంటికి వెళ్లి సర్ ప్రైజ్ ఇచ్చిన యష్.. ఫోటోలు వైరల్..

అయితే, ఫిబ్రవరి 8న మదర్సా కూల్చివేత తర్వాత స్థానికులు మున్సిపల్ కార్మికులతో పాటు పోలీసులపై రాళ్లు, పెట్రోల్ బాంబులతో దాడి చేయడంతో హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. మరో గుంపు ఒక పోలీసు స్టేషన్‌కు నిప్పంటించడంతో గందరగోళానికి కారణమైంది. ఈ దాడుల్లో ఆరుగురు మరణించడంతో పాటు పోలీసు సిబ్బంది, జర్నలిస్టులతో సహా వంద మందికి పైగా గాయపడ్డారు. బన్‌భూల్‌పురా అంతటా విధించిన కర్ఫ్యూ ఇప్పటికే పట్టణంతో పాటు ఇతర ప్రాంతాలలో ఎత్తివేయబడింది.

Exit mobile version