NTV Telugu Site icon

Haiti Prime Minister: హైతీ ప్రధాని రాజీనామా.. ఎందుకో తెలుసా..?

Haitis

Haitis

హైతీ ప్రధాన మంత్రి ఏరియెల్‌ హెన్రీ తన పదవికి రాజీనామా చేశారు. హెన్రీ రాజీనామాను ఆమోదించినట్లు చైర్‌ ఆఫ్‌ ద కరేబియన్‌ కమ్యూనిటీ ఇర్ఫాన్‌ అలీ తెలిపారు. హెన్రీ హైతీకి చేసిన సేవలకు గాను ఈ సందర్భంగా అలీ ధన్యవాదాలు చెప్పారు. అయితే, హౌతీలో తిరుగుబాటు చేసిన సాయుధ గ్యాంగులతో పోరాటంలో సహకరించాల్సిందిగా ఐక్యరాజ్యసమితి(UN) ఇంటర్నేషనల్‌ సెక్యూరిటీ మిషన్‌ను కోరేందుకు గత నెల హెన్రీ కెన్యాకు వెళ్లారు. అయితే, అదే రోజు సరిగ్గా రాజధాని పోర్ట్‌ ఆవ్‌ ప్రిన్స్‌లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున హింస చోటు చేసుకుంది. దీంతో హెన్రీ దేశం బయటే అమెరికాకు చెందిన పూర్టో రికో ప్రాంతంలో ఉండిపోవాల్సి పరిస్థితి ఏర్పాడింది.

Read Also: Haryana: హర్యానా సీఎం రాజీనామా.. కారణం అదే..?

ఇక, సాయుధ గ్యాంగులు ఏరియెల్ హెన్రీ దిగిపోవాల్సిందేనంటూ డిమాండ్‌ చేశాయి. హైతీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సోమవారం నాడు జమైకాలో ప్రాంతీయ నేతల సమావేశం కొనసాగింది. ఇంతలోనే హెన్రీ తన పదవికీ రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఇక, 2021లో అప్పటి దేశాధ్యక్షుడు మొయిస్‌ హత్య తర్వాత హెన్రీ హైతీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. హైతీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు శర వేగంగా చేయాలని అమెరికా కూడా ఇప్పటికే వెల్లడించింది.

Read Also: Hardik Pandya: హార్దిక్‌ పాండ్యా లేకున్నా.. గుజరాత్ టైటాన్స్‌ పటిష్టంగానే ఉంది!

అయితే, హెన్రీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయాడని.. ఎన్నికలు జరగకుండా కావాలనే వాయిదా వేస్తున్నారని దేశంలో ఆయనపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. హైతీలో మొదట శాంతి భద్రతలు పునరుద్ధరించాలని.. స్వేచ్ఛాయుత ఎన్నికలు జరిగేందుకు కావాల్సిన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్‌ కోరారు. అయితే, 2016 నుంచి ఇప్పటి వరకు హైతీలో ఎన్నికలు జరగలేదన్నారు.