Site icon NTV Telugu

Haindava : అదిరిపోయిన ‘హైందవ’ ఫస్ట్ లుక్..

Sindhavam

Sindhavam

గతేడాది ‘కిష్కింధపురి’ వంటి సాలిడ్ హారర్ థ్రిల్లర్‌తో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఇప్పుడు మరో పవర్‌ఫుల్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మహేష్ చందు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘హైందవ’ అనే టైటిల్‌ను ఖరారు చేయగా. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఒక చేతిలో గొడ్డలి, మరో చేతిలో కాగడా పట్టుకుని పవర్ ఫుల్ లుక్‌లో శ్రీనివాస్ కనిపిస్తుండగా, బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న వరాహం డిజైన్ పోస్టర్‌కే హైలైట్‌గా నిలిచింది. మేకర్స్ దీనిని పర్‌ఫెక్ట్‌గా డిజైన్ చేశారు.

Also Read : Meenakshi- Pradeep : మీనాక్షి చౌదరితో..ప్రదీప్ రంగనాథన్ సైన్స్ ఫిక్షన్ సినిమా !

ఇక ఈ ఫస్ట్ లుక్ తో పాటు ‘అతను ఒంటరి వాడు కాదు.. అతనికి అండగా ఆ దశావతారాలే ఉన్నాయి’ అంటూ ఇచ్చిన క్యాప్షన్ ప్రేక్షకుల్లో మరింతాసక్తిని పెంచుతున్నాయి. దీన్ని బట్టి సినిమా కథాంశం పురాణాలకు, ప్రస్తుత కాలానికి ముడిపడి ఉన్న ఒక సాలిడ్ థ్రిల్లర్ అని అర్థమవుతోంది. ఈ చిత్రానికి సామ్ సి.ఎస్ సంగీతం అందిస్తుండగా మూన్ షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ సినిమాతో బెల్లంకొండ శ్రీను తన ఖాతాలో మరో భారీ హిట్ వేసుకోవడం ఖాయమనిపిస్తోంది.

Exit mobile version