NTV Telugu Site icon

Rain Alert: తెలంగాణలో నేటి నుంచి మూడ్రోజుల పాటు వడగళ్ల వర్షాలు

Tg Rains Alert

Tg Rains Alert

తెలంగాణలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతుంది. వడగాల్పుల ప్రభావం కూడా ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం 15 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, ఖమ్మం, కొమరంభీం, మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ అయ్యింది. కాగా.. సోమవారం (మార్చి 31) ఆదిలాబాద్‌లో సాధారణం కన్నా 2.4 డిగ్రీలు పెరిగి 41.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు చెప్పారు. మరోవైపు.. హైదరాబాద్ నగరంలో గాలిలో తేమ శాతం కూడా భారీగా తగ్గిపోయింది. రాష్ట్రంలోనే అతితక్కువగా తేమశాతం నమోదవుతుంది. దీంతో తీవ్రమైన వేడితో నగర ప్రజలు అల్లాడిపోతున్నారు.

READ MORE: Sanoj Mishra : మోనాలిసా డైరెక్టర్ సనోజ్ మిశ్రా కేసులో భారీ ట్విస్ట్..

ఈ నేపథ్యంలో వాతావరణ కేంద్రం తెలంగాణ ప్రజలకు చల్లని కబురు అందించింది. నేటి నుంచి వాతావరణం మారుతుందని.. మూడ్రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. నేటి నుంచి రానున్న మూడ్రోజుల్లో వడగళ్ల వానలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. మంగళ, బుధ, గురువారాల్లో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మొదలై ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 50 కిలోమీటర్లలోపు ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని.. అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

READ MORE: MS Dhoni: ఎంఎస్ ధోనీ బ్యాటింగ్‌ ఆర్డర్‌పై చెన్నై కోచ్‌ ఏమన్నాడంటే?