Site icon NTV Telugu

Haider Ali: యువతిపై అత్యాచారం.. మ్యాచ్ మధ్యలోనే పాక్ స్టార్ క్రికెటర్‌ అరెస్ట్‌!

Haider Ali Rape Case

Haider Ali Rape Case

Pakistan Cricketer Haider Ali Arrested Over Rape Allegations: పాకిస్తాన్ క్రికెట్ ఎప్పుడూ ఏదో ఒక కారణంతో వార్తల్లో ఉంటుందన్న విషయం తెలిసిందే. వివాదాలు, లైంగిక వేధింపులు, మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో పాక్ క్రికెటర్స్ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. సల్మాన్ బట్, మహ్మద్ అమీర్, మహ్మద్ ఆసిఫ్.. లాంటి స్టార్స్ చిక్కుల్లో పడ్డారు. తాజాగా మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. యువతిపై అత్యాచారం కేసులో పాక్ యువ ఆటగాడు హైదర్ అలీ అరెస్ట్‌ అయ్యాడు. ఇంగ్లండ్‌లో అత్యాచార ఆరోపణల కేసు నమోదవడంతో.. గ్రేటర్‌ మాంచెస్టర్‌ 24 ఏళ్ల హైదర్‌ అలీని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

పాకిస్తాన్ మూలానికి చెందిన ఓ అమ్మాయిపై అత్యాచారం కేసులో హైదర్ అలీని మాంచెస్టర్‌ పోలీసులు అరెస్ట్ చేశారని టెలికాం ఆసియా స్పోర్ట్స్ నివేదించింది. ఇంగ్లండ్‌ పర్యటన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆగస్టు 3న పాకిస్తాన్‌-ఏ (షాహీన్స్‌) తరఫున బెకెన్హెయిమ్‌లో ఇంగ్లండ్‌-ఏ జట్టుతో వన్డే మ్యాచ్‌ ఆడుతుండగా అలీని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతడు బెయిల్‌పై విడుదల అయ్యాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తాత్కాలికంగా అతడిని సస్పెండ్ చేసింది. విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్‌ కొనసాగుతుందని పీసీబీ పేర్కొంది. విచారణ సందర్భంగా అలీ కన్నీరు పెట్టుకున్నట్లు సమాచారం. తాను నిర్దోషినంటూ పోలీసులకు చెప్పాడట.

Also Read: Sanju Samson: ప్లీజ్.. నన్ను వదిలేయండి బాబోయ్! శాంసన్ రెండు ఆప్షన్లు ఇవే

24 ఏళ్ల హైదర్‌ అలీ 2020లో పాకిస్తాన్ తరఫున అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 35 టీ20లు, 2 వన్డేలు ఆడాడు. చివరిసారిగా రెండేళ్ల క్రితం ఆసియా కప్‌లో ఆడాడు. 2020లో దక్షిణాఫ్రికాలో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ తరపున ఆడాడు. మెగా టోర్నీలో అద్భుత ప్రదర్శన చేయడంతో జాతీయ జట్టు తరఫున ఆడే అవకాశం వచ్చింది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హైదర్‌ అలీపై అత్యాచారం కేసు పెను ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.

Exit mobile version