NTV Telugu Site icon

Betting Gang : హఫీజ్‌పేట్‌లో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. భార్యభర్తలు అరెస్టు

Betting

Betting

Betting Gang : హైదరాబాద్‌లోని హఫీజ్‌పేట్‌లో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠాను మియాపూర్ SOT పోలీసులు బట్టబయలు చేశారు. ఫేక్ కంపెనీల పేరిట బ్యాంక్ ఖాతాలను ఓపెన్ చేసి, ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న భార్యభర్తలను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మాడిశెట్టి అజయ్, అతని భార్య సంధ్య కలిసి మూడు క్రికెట్ బెట్టింగ్ యాప్స్ ద్వారా భారీ స్థాయిలో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించబడింది. పోలీసులు వీరి అకౌంట్లను పరిశీలించగా, ఏకంగా 40 లక్షల రూపాయల విలువైన బెట్టింగ్ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు.

Navdeep : కొత్త వ్యాపారం మొదలు పెట్టిన నవదీప్..సపోర్ట్‌గా మంచు లక్ష్మీ

పోలీసులు బెట్టింగ్ ముఠాను పట్టుకునే క్రమంలో నిందితుల నుంచి రూ. 55,000 నగదు, బ్యాంక్ ఖాతాల్లో రూ.22 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.. అంతేకాకుండా.. మొత్తం 7 అకౌంట్లను గుర్తించారు. అజయ్ గతంలోనే నాలుగు సార్లు క్రికెట్ బెట్టింగ్ కేసుల్లో పట్టుబడ్డాడు. అయినప్పటికీ, మరోసారి బెట్టింగ్ నిర్వహిస్తూ పోలీసులకు దొరికిపోయాడు.

పోలీసులు ఈ బెట్టింగ్ ముఠాతో సంబంధమున్న ముగ్గురు ఫంటర్లను అదుపులోకి తీసుకుని, వారిని మియాపూర్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో హైదరాబాద్‌లో ఆన్‌లైన్ బెట్టింగ్ మాఫియా భారీగా విస్తరించిందని స్పష్టమవుతోంది. అధికారులు అలాంటి అక్రమ కార్యకలాపాలపై మరింత నిఘా ఉంచాలని కోరుతున్నారు.

Margani Bharat: గడిచిన నాలుగైదు రోజులుగా రాజమండ్రి అట్టుడికి పోతుంది