టాలీవుడ్ టాప్ కమెడియన్ బ్రహ్మానందం ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు.బ్రహ్మానందం ఓటీటీ ఎంట్రీ మూవీ టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఇటీవల రివీల్ చేశారు.ఈ సినిమాకు “వీవీవై” అనే డిఫరెంట్ టైటిల్‌ను ఖరారు చేశారు. వీవీవై అంటే ఏమిటన్నది మాత్రం రివీల్ చేయలేదు. వీవీవై మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో జూలై 18న రిలీజ్ కాబోతోంది.రోడ్ జర్నీ బ్యాక్‌డ్రాప్‌లో ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోన్నట్లు సమాచారం. టైటిల్ పోస్టర్‌లో ఎల్లో కలర్ వ్యాన్‌ను చూపించారు. మోస్ట్ ఎంటర్‌టైనింగ్ ట్రిప్ ఆఫ్ ది ఇయర్ అంటూ పోస్టర్‌పై ఉన్నక్యాప్షన్ ఆసక్తిని పంచుతోంది.వీవీవై మూవీలో బ్రహ్మానందంతో పాటు సీనియర్ నటుడు నరేష్, కీడా కోలా ఫేమ్ రాగ్‌మయూర్ మరియు ప్రియా వడ్లమాని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బ్రహ్మానందం పాత్ర, ఆయన కామెడీ టైమింగ్ ఈ సినిమాకు మెయిన్ ఎస్సెట్‌గా ఉండబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ బ్రహ్మానందం క్యారెక్టర్ కామెడీ హైలైట్ గా ఉంటుందని చెబుతోన్నారు.
గెస్ట్ అప్పిరియెన్స్‌లా కాకుండా వీవీవై మూవీలో బ్రహ్మానందం పాత్ర స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కనిపిస్తుందని సమాచారం.వీవీవై మూవీతో అనురాగ్ పాలుట్ల దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. భామకలాపం మరియు అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలను నిర్మించిన డ్రీమ్ ఫార్మర్స్ బ్యానర్‌పై బాపినీడు మరియు సుధీర్ ఈదర వీవీవై మూవీని నిర్మిస్తున్నారు. ఇటీవల వీవీవై మూవీ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టినట్లు తెలుస్తుంది.. వీవీవై మూవీకి ఆర్ హెచ్ విక్రమ్ సంగీతం అందిస్తుండగా అంకుర్ సి సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు.బ్రహ్మానందం గారు 2019 వరకు గ్యాప్ లేకుండా సినిమాలు చేశారు.. హార్ట్ సర్జరీ కారణంగా 2020 నుంచి సినిమాల వేగాన్ని తగ్గించారు.. గత ఏడాది బ్రో మరియు భోళాశంకర్‌తో పాటు మరికొన్ని సినిమాల్లో గెస్ట్ పాత్రలు చేశారు రంగమార్తండలో సీరియస్ రోల్‌లో కనిపించి నటుడిగా తనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు చూపించారు.. చాలా కాలం తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన కీడాకోలా సినిమాలు ఫుల్ లెంగ్త్ రోల్ చేసిఎంతగానో మెప్పించారు.