NTV Telugu Site icon

GVL Narasimha Rao: ఏపీలో కూటమి మేనిఫెస్టోకు సహకరిస్తాం.. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకే మెజార్టీ స్థానాలు..!

Gvl

Gvl

GVL Narasimha Rao: ఏపీలో కూటమి మేనిఫెస్టోకు బీజేపీ మద్దతు లేదంటూ వస్తున్న విమర్శలకు కౌంటర్‌ ఇచ్చారు బీజేపీ నేత జీవీఎల్‌ నరసింహారావు.. బీజేపీకి జాతీయ మేనిఫెస్టో మాత్రేమే ఉంటుందన్న ఆయన.. బీజేపీ మేనిఫెస్టోకి ఎన్డీఏ పక్షాలు మద్దతు ఇచ్చినట్లే.. ఏపీలో కూటమి మేనిఫెస్టోకు బీజేపీ సహకరిస్తుందని స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన జీవీఎల్.. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 370 స్థానాలు.. ఎన్డీఏకి 400 స్థానాల్లో గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ మెజారిటీ స్థానాలు సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

Read Also: T20 World Cup 2024: చాలా నిరాశ చెందా.. భారత జట్టులో మావోడు ఒక్కడూ లేడు: స్టార్ హీరో

ఇక,స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు సింబల్ కేటాయింపు పై జనసేన హైకోర్టును ఆశ్రయించింది.. ఏపీలో ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు జీవీఎల్.. ఏపీలో మోడీ ఫ్యాక్టర్ ను కూటమి వినియోగించుకోవాలన్న ఆయన.. ప్రజలు నరేంద్ర మోడీనే మరోసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. కూటమి నేతలు ప్రచారంలో మోడీ గురించి ప్రస్తావిస్తే కూటమికి మంచి ఫలితాలు వస్తాయన్నారు. మరోవైపు, తెలంగాణలో బీజేపీ 10 పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీని విమర్శించే నైతికత మాజీ సీఎం కేసీఆర్ కోల్పోయారని.. బీఆర్ఎస్ అవినీతి మయం అయ్యింది.. తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందన్నారు. ఇచ్చిన హామీలు అమలు పర్చని కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు జీవీఎల్‌ నరసింహారావు.

Show comments