GV Prakash : ఇండియాస్ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ. ఆర్ .రెహమాన్ మేనల్లుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జీ.వి ప్రకాష్ కుమార్ కూడా మేనమామ వెరీ ట్యాలెంటెడ్ . సంగీత దర్శకుడిగానే కాకుండా హీరోగానూ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఓ వైపు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తూనే హీరోగానూ చాలా సినిమాలు చేశాడు.. ఇంకా చేస్తూనే ఉన్నాడు. ఓ పెద్దింటి కుటుంబం నుంచి వచ్చినా? జీవీ పోషించే పాత్రలను చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తుంటాయి. మరి నటుడంటే అంతే.. ఎలాంటి పాత్ర అయినా పోషించగలగాలి. అప్పుడే పరిపూర్ణ నటుడు అవుతాడు అనడానికి జీవీ ప్రకాష్ ఓ ఫర్ ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. ఎలాంటి డీ గ్రేడ్ పాత్రలోనైనా జీవీ ప్రకాష్ జీవిస్తాడు. అలాంటి భిన్నమైన పాత్రలకైనా ఆయన జీవం పోస్తాడు. మరి అలాంటి జీవి సంగీత దర్శకుడిగా 100వ సినిమాలకు చేరువలో ఉన్నాడు? అంటే నమ్ముతారా? అవును జీవి ఇప్పుడు సెంచరీకి అతి చేరువలో ఉన్నాడు. 2006లో మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రయాణం మొదలు పెట్టాడు.
తొలిసారి `వెయిల్` అనే సినిమాకి మ్యూజిక్ అందించాడు. అక్కడి నుంచి జీవి మ్యూజిక్ డైరెక్టర్ గా వెనక్కి తిరిగి చూడలేదు. రెహమాన్ సారథ్యంలో గాయకుడిగా, కంపోజర్ గా రాటు దేలడంతో అవకాశాల పరంగా తనకు ఎదురు లేకుండా పోయింది. సంగీత దర్శకుడిగా పీక్స్ లో ఉండగానే నటుడిగా ప్రస్తానం మొదలు పెట్టాడు. చిన్న పాత్రలతో మొదలై స్టార్ హీరోల సినిమాల్లో సైతం నటించడం మొదలు పెట్టాడు. అలా నటుడిగా కొనసాగుతూనే మెయిన్ ట్రాక్ లో మ్యూజిక్ ని పెట్టి ముందుకు దూసుకు వెళ్తున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన తెలుగు సినిమా లక్కీ భాస్కర్ కి జీవీనే మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. అలాగే `అమరన్` సినిమాకు కూడా ఇతడే సంగీతం అందించాడు. ఇది రెండు రాష్ట్రాల్లోనూ బ్లాక్ బస్టర్ అయింది. ఈ నేపథ్యంలో 100వ సినిమా సీక్రెట్ విప్పాడు. సుధ కొంగర దర్శకత్వంలో 100 వ సినిమా ఉంటుందని తెలిపాడు. త్వరలోనే ఈ సినిమా పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు.
Read Also:Salman Khan: సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు.. దమ్ముంటే వారిని రక్షించుకోవాలని వార్నింగ్