NTV Telugu Site icon

Harsha Kumar: హర్షకుమార్‌ సవాల్.. తాను చెప్పింది నిజంకాదని రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా..!

Harsha Kumar

Harsha Kumar

Harsha Kumar: తాను చెప్పినవి నిజంకాదని ఇంజనీర్లు ఎవరైనా రుజువు చేస్తే.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటాను అంటూ బహిరంగ సవాల్‌ విసిరారు మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రాంతీయ పార్టీలైన తెలుగుదేశం, వైసీపీ పార్టీలు రెండూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపించారు. 500 కోట్లతో రుషికొండ మీద ప్యాలెస్ జగన్ నిర్మించి దుర్వినియోగం చేస్తే, పోలవరం ప్రాజెక్టు ప్రజలకు చూపించడానికి చంద్రబాబు 500 కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్, గైడ్ బండ్ నిర్మాణాలు పక్కా ప్లాన్ ప్రకారం నిర్మాణం జరగలేదన్నారు. ఈ రెండు దెబ్బతినదానికి కారకులైన అధికారులుపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.

Read Also: CM Revanth Reddy: ఫీజు రీయింబర్స్మెంట్ పై సీఎం శుభవార్త..

ఇక, చంద్రబాబు హయంలోనే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరిగిందని అన్నారు హర్షకుమార్.. చంద్రబాబు వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బ్బతింది.. నిర్ధేషిత లోతులోకి నిర్మించకపోవడం వల్లే అది కొట్టుకుపోయిందని మ్యాప్ లో చూపించి వివరించారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అయిన ఖర్చు ఆ అధికారులు నుంచే వసూళ్లు చేయాలని డిమాండ్ చేశారు. రెండు డయాఫ్రమ్ వాల్స్ నిర్మించాల్సివుండగా ఒక్కటే నిర్మించారని ఆరోపించారు. ఇంటికి పునాది ఎలాగో ప్రాజెక్టుకు డయాఫ్రమ్ వాల్ అలాగే నిర్మిస్తారని, అలాంటిది నిర్లక్ష్యం తో నిర్మించడం వల్ల ప్రాజెక్టు లో కీలక మైన అది కొట్టుకుపోయిందని వివరించారు. తాను చెప్పినవి నిజంకాదని ఇంజనీర్లు ఎవరైనా రుజువు చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌.