NTV Telugu Site icon

SP Alam : ఆదిలాబాద్ జిల్లాలో గుట్కా పై ఉక్కు పాదం

Seized Gutka

Seized Gutka

రాష్ట్రంలో నిషేధిత గుట్కా ను బ్యాన్ చేయడంతో ఆదిలాబాద్ జిల్లాలో పక్క సమాచారంతో ఆదిలాబాద్ పట్టణంలోని 5 గోడౌన్స్ లో జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టగా, అర్ధరాత్రి స్థానిక ఓంకార్ జిన్నింగ్ మిల్ నందు నాలుగు గోడౌన్స్ లలో , చాందా వద్దగల ఒక గోడౌన్ నందు రూ 77,60,586 లక్షల విలువ చేసే నిషేధిత గుట్కా లభించిందని తెలిపారు. అర్ధరాత్రి జిల్లా ఎస్పీ, డిఎస్పి, సిసిఎస్ సిబ్బంది, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది కలిసి ఈ దాడులు నిర్వహించారు. దాడుల్లో భాగంగా ఆదిలాబాద్ వన్ టౌన్ లోని ఓంకార్ జిన్నింగ్ నందు గల నాలుగు గోడౌన్స్ లో రూ 50,16,942/- విలువచేసి దాదాపు 20 రకాల నిషేధిత గుట్కా లభించిందని నలుగురిపై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు . అలాగే ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రూ 27,43,644/- విలువ చేసి నిషేధిత గుట్కా లభించిందని నలుగురిపై కేసులు నమోదు చేసామని తెలిపారు. స్వాధీనం చేసుకున్న నిషేధిత గుట్కా విలువ రూ 77,60,586/- లక్షల చేసే నిషేధిత గుట్కాను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేయగా మిగిలిన ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

నిందితుల వివరాలు
1) సాజిదుల్లా ఖాన్ s/o అజ్మతుల్లా ఖాన్, ఆదిలాబాద్.
2) అస్లాం ఖాన్ s/o అజ్మతుల్లా ఖాన్, ఆదిలాబాద్. (పరారీ)
3) సమీ ఉల్లా ఖాన్ s/o అజ్మతుల్లా ఖాన్, ఆదిలాబాద్. (పరారీ)
4) ఫసివుల్లా ఖాన్ s/o అజ్మతుల్లా ఖాన్, ఆదిలాబాద్.
5) అర్బాజ్ అలీ.(పరారీ)
మొదటి నలుగురిపై ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఐదవ వ్యక్తిపై ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయబడిందని తెలిపారు. లభించిన గుట్కా దాదాపు 20 రకాల రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిషేధించబడిందని తెలిపారు. ఈ గుట్కా వినియోగం వల్ల ప్రజలకు తీవ్ర అనారోగ్యం, దీర్ఘకాలిక రోగాల బారిన పడటం, ప్రమాదకరంగా ఉండటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం వీటిని నిషేధించడం జరిగిందని తెలిపారు. లభించిన నిషేధిత గుట్కా రకాలు అనర్, ఎస్ ఆర్ వన్, ఎక్సెల్ వన్, షార్ట్ 999, ఆర్ 50, జెడ్ ఎల్, సితార గుట్కా, మాణిక్చంద్, హెచ్ ఫైవ్, స్వాగత్ లాంటి పేర్లతో ఉండటం జరిగిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నిషేధిత గుట్కాను అమ్మనా, రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గుట్కాను సమూలంగా జిల్లా వ్యాప్తంగా రూపుమాపాలనే ఉద్దేశంతో ప్రత్యేక సిబ్బందిని నియమిస్తూ నిఘా వ్యవస్థను పటిష్టం చేస్తూ విధులను నిర్వర్తించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గుట్కా విక్రయదారులు నిషేధిత గుట్కాను విక్రయించడం మానుకోవాలని సూచించారు. అర్ధరాత్రి దాడుల్లో జిల్లా ఎస్పీ తో సహా, ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, సిఐలు కే సత్యనారాయణ, ఏ అశోక్, ఎ రమాకాంత్, సిసిఎస్ సిబ్బంది, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.