Site icon NTV Telugu

Crime News: డేటింగ్ యాప్‌లో పరిచయం.. మహిళపై సామూహిక అత్యాచారం

Harassment

Harassment

Crime News: మహిళలు, ఆడపిల్లలపై అత్యాచారాల ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు చేసినా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని కఠిన చట్టాలు చేసినా వీటిలో మార్పు రావడంలేదు. తాజాగా హర్యానాలోని గురుగ్రామ్‌లో ఓ దారుణం చోటుచేసుకుంది. సెక్టార్ 50 ప్రాంతంలోని హోటల్‌లో డేటింగ్ యాప్‌లో పరిచయమైన వ్యక్తి, అతని స్నేహితుడు ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు మంగళవారం తెలిపారు.

Also Read: Road Accident: రాఖీల కోసం వెళ్లి.. మృత్యు ఒడిలోకి చేరిన బాబాయ్, అమ్మాయి!

బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. ఆమె డేటింగ్ యాప్ ద్వారా నిందితుడిని కలిసిందని, ఆ తర్వాత జూన్ 29న ఆమెను నిందుతుడు హోటల్‌కు ఆహ్వానించాడని పోలీసులు తెలిపారు. ఆమె హోటల్‌కు చేరుకున్నప్పుడు, ఇద్దరు వ్యక్తులు ఆమెకు ఆహారం అందించారని, అది తిన్న తర్వాత ఆమె స్పృహ కోల్పోయిందని ఆమె ఆరోపించింది. “దీనిని సద్వినియోగం చేసుకుని, వారు నాపై అత్యాచారం చేసి, ఆ చర్యను వీడియో కూడా తీశారు. నేను స్పృహలోకి వచ్చిన తర్వాత వారిని నిలదీస్తే, నిందితుడు ఆమె వీడియోను వైరల్ చేస్తానని బెదిరించాడు. ఎలాగోలా ఇంటికి తిరిగి వచ్చాను కానీ ఇప్పుడు పోలీసులను ఆశ్రయించాను’ అని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. సెక్టార్ 50 పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు గుర్తు తెలియని నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, ఈ విషయంలో విచారణ జరుగుతోందని ఎస్‌హెచ్‌ఓ ప్రవీణ్ మాలిక్ తెలిపారు.

Exit mobile version