NTV Telugu Site icon

Guru Purnima 2024: 15 వేల ఏళ్ల క్రితం మొదటి గురువు.. సద్గురు పోస్ట్ వైరల్!

Sadhguru Post

Sadhguru Post

Sadhguru Post on Guru Purnima: జీవితానికి సరైన దిశను చూపడానికి ‘గురువు’ ఎంతో ముఖ్యం. గురువు మార్గదర్శకత్వంలో నడుచుకుంటే.. జీవితంలో సకల సౌఖ్యాలు చేకూరుతాయని సనాతన ధర్మంలో చెప్పబడింది. గురువుకు కృతజ్ఞత తెలిపే రోజు ‘గురు పౌర్ణిమి’. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్లపక్ష పౌర్ణమి రోజున గురు పూర్ణిమను జరుపుకుంటారు. ఈ ఏడాది ఆదివారం (జూలై 21)న వచ్చింది. ఈ రోజున గురువులను పూజించి వారి ఆశీస్సులు తీసుకుంటారు. వేదాలను రచించిన వేద వ్యాసుడు ఆషాఢ పూర్ణిమ రోజున జన్మించాడని ప్రతీతి. అందుకే ఈ రోజును వేదవ్యాసుని జయంతిగా జరుపుకుంటారు.

Also Read: CM Revanth Reddy: ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. సాయంత్రం కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ!

అయితే గురు పూర్ణిమ సందర్భంగా ఆధ్యాత్మిక గురువు, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ఓ పోస్ట్ చేశారు. గురు పూర్ణిమను మనం ఎందుకు జరుపుకొంటామో తెలుపుతూ.. పదిహేను వేల సంవత్సరాల క్రితం మొదటి గురువు ఆవిర్భవించిన కథను చెప్పారు. మొదటి గురువు ఆవిర్భవించిన రోజే గురు పూర్ణిమ అని పేర్కొన్నారు. ‘15,000 ఏళ్ల క్రితానికి పైగా ఆదియోగి తెలుసుకున్నదంతా మానవాళికి అందించారు. తద్వారా మనుషులు సృష్టి మూలాన్ని గ్రహించే, అర్థం చేసుకునే విధానంలో ఎంతో మార్పు వచ్చింది. వ్యక్తికి మరియు పరమోన్నతమైన సృష్టి మూలానికి తనని తాను వారధిగా మార్చుకున్నారు. మీరు ఈ మూలాన్ని చేరుకునేందుకు ఈ వారధిని వినియోగించుకుంటారని నా ఆకాంక్ష. నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది’ అని సద్గురు పేర్కొన్నారు.