NTV Telugu Site icon

Gunturu karam: వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ‘గుంటూరు కారం’ డేట్ ఫిక్స్..!

10

10

2024 సంక్రాంతి బరిలో దిగిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమా ‘గుంటూరు కారం’. మాటలు మాంత్రికుడు ‘త్రివిక్రమ్ శ్రీనివాస్’ ఈ సినిమాను మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ముందుకి తీసుకోవచ్చారు. ఇందులో మహేష్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ భారీ ఖర్చుతో నిర్మించారు. ఈ సినిమాకి అదిరిపోయే మ్యూజిక్ ను ఎస్ఎస్ థమన్ అందించాడు.

Also Read: 2000 Notes Exchange: రూ.2000 నోట్ల డిపాజిట్లను ఆపేసిన ఆర్బీఐ..!

ఇక సినిమా పరంగా చూస్తే.. జూలై 12న విడుదలైన ఈ సినిమా మొదట్లో డివైడ్ టాక్ తెచ్చుకున్న వసూళ్ల పరంగా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. మొదటి రెండు మూడు రోజులు సినిమాపై నెగిటివ్ టాక్ వచ్చిన కానీ.. ఆపై ఫ్యామిలీ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ రావడంతో వసూల్ల పరంగా కూడా బాగానే రాబట్టింది గుంటూరు కారం. కాకపోతే మహేష్ బాబు సినిమాలకు తగ్గ కలెక్షన్స్ రాబట్టుకోలేకపోయిందని చెప్పవచ్చు. ఇక అసలు విషయం ఇక అసలు విషయంలోకి వెళ్తే..

Also Read: Tillu Square OTT: వామ్మో.. టిల్లు స్క్వేర్ ఓటీటీ అన్ని కోట్లకి అమ్ముడుపోయిందా..?!

గుంటూరు కారం సినిమా ప్రముఖ ఓటీటీలో విడుదల అయ్యి అక్కడ మంచి వ్యూస్ సాధించిన తర్వాత.. ఇక బుల్లితెరపై ప్రేక్షకులను అలరించబోతోంది. ఇందుకు సంబంధించి ప్రముఖ తెలుగు టెలివిజన్ ఛానల్ జెమినీలో ఏప్రిల్ 7 సాయంత్రం 6 గంటల సమయంలో టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం కాబోతోంది. చూడాలి మరి ఈ సినిమాకు టెలివిజన్ ప్రేక్షకులు ఏమాత్రం రెస్పాన్స్ ఇస్తారో.

Show comments