Site icon NTV Telugu

Newyork : అమెరికాలో విషాదం.. ట్రెక్కింగ్ చేస్తూ గుంటూరు వాసి మృతి

New Project (14)

New Project (14)

Newyork : అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న గుంటూరుకు చెందిన గంగూరి శ్రీనాథ్ (32) ట్రెక్కింగ్ చేస్తుండగా జారిపడి మృతి చెందాడు. గుంటూరు వికాస్‌నగర్‌కు చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సుఖవాసి శ్రీనివాసరావు-రాజశ్రీ దంపతుల కుమార్తె సాయి చరణి, రాజేంద్రనగర్‌కు చెందిన శ్రీనాథ్‌కు ఐదేళ్ల క్రితం వివాహమైంది. సాయిచరణి, శ్రీనాథ్ ఇద్దరూ అమెరికాలో సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. ఆదివారం కావడంతో ట్రెక్కింగ్ కోసం క్లీవ్‌లెన్స్ పర్వతారోహణకు వెళ్లాడు. ఈ మౌంటెన్ హిల్స్‌పై ట్రెక్కింగ్ చేస్తుండగా, 200 అడుగుల ఎత్తు నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయాడు. గతంలో ఫ్లోరిడాలో ఉన్న వీరు ఇటీవల అట్లాంటాకు మారారు. ఆదివారం సెలవు కావడంతో ట్రెక్కింగ్ కోసం క్లీవ్‌లెన్స్ మౌంటెన్ హిల్స్‌‌కు వెళ్లి మృత్యువాతపడ్డారు. శ్రీనాథ్ మృతదేహాన్ని గుంటూరు తీసుకొచ్చేందుకు వారం రోజులు పట్టే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.

Read Also: Uppal Double Murder: కేసులో ఆసక్తిరమైన విషయాలు.. సెల్ ఫోన్ టవర్ లొకేషన్ తో నిందితులు అరెస్ట్‌

టెక్కింగ్ చేసే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పర్వతం గానీ కొండ గానీ ఎక్కే ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ట్రెక్కింగ్ ప్రారంభించాలి. గతంలోనూ కేరళ రాష్ట్రం పాలక్కడ్‌లోని నిటారుగా దుర్భేద్యంగా ఉన్న కురుంబాచి కొండను(చెరాడ్ కొండల్లో ఇది ఒకటి) ఎక్కడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి కొండల్లో ఇరుక్కుని బతుకు జీవుడా అంటూ బయటపడ్డాడు. ముగ్గురు మిత్రులు ట్రెక్కింగ్ ప్రారంభించారు. సగం దూరం వెళ్లాక బాబుతో వచ్చిన ఇద్దరు మిత్రులు ఆ కొండ ఎక్కలేకపోయారు. కానీ, బాబు మాత్రం తన ట్రెక్కింగ్ ఆపలేదు. చివరకు ఆయన కొండ టాప్‌కు వెళ్లాడు. కానీ, కొండ టాప్ నుంచి ఆయన జారిపోయాడు. లోయలాగా ఉన్న లోతైన భాగంలోకి పడి రాళ్ల మధ్యలో చిక్కుకున్నాడు. ఆయన ఆ రాళ్ల మధ్యలో చిక్కుకుని 24 గంటలు ఎప్పుడో దాటి పోయింది. ఇప్పటికీ అక్కడే ఉండిపోయాడు. ఆయన కాలుకు తీవ్ర గాయం అయింది. మరికొన్ని గాయాలూ అయ్యాయి. బాబు తన కాలి గాయమైన చిత్రాలను పంపించారు. రెస్కూ వర్కర్లు బాబును వెతుక్కుంటూ ఆయన దగ్గర వరకు వెళ్లగలిగారు. చివరికి నేవీ సిబ్బంది అతి కష్టం మీద కాపాడగలిగారు.

Exit mobile version