NTV Telugu Site icon

Guntur Kaarm : ఓటీటీలోకి వచ్చేస్తున్న గుంటూరు కారం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Whatsapp Image 2024 02 04 At 10.36.45 Am

Whatsapp Image 2024 02 04 At 10.36.45 Am

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు.గుంటూరు కారం మూవీ ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది.ఇక ఈ సినిమాలో మహేష్ బాబు తన డ్యాన్స్ మరియు ఫైట్స్ తో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించారు. ఇక ‘ఆ కుర్చీని మడతబెట్టి’ సాంగ్ గురించైతే చెప్పనక్కర్లేదు. ఈ సాంగ్ లో హీరోయిన్ శ్రీలీల, మహేష్ బాబు డాన్స్ ఇరగదీశారు. ఇక ఆ సాంగ్ కూడా ప్రస్తుతం టాప్ ట్రెండింగ్ లో నిలిచింది..

ఇదిలా ఉంటే ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది. జనవరి 12న రీలీజైన ఈ సినిమా ఫిబ్రవరి 9 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.ఈ విషయాన్నీ ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది.తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ మరియు హిందీ భాషలలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది. అయితే ఈ మూవీ ఓటీటీ వెర్షన్ లో కొన్ని సీన్లు యాడ్ చస్తున్నట్లు తెలుస్తోంది.’గుంటూరు కారం’ సినిమా రన్ టైం..159 నిమిషాలు. అయితే, ఓటీటీలో మాత్రం ఆ సమయం పెరగనుందని సమాచారం. కారణం.. సినిమాలో అమ్మ పాట మరియు కబడ్డీ బ్యాక్ డ్రాప్ కు సంబంధించి కొన్ని యాక్షన్ సీన్లను యాడ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా నిడివి ఎక్కువగా ఉన్న కారణంగా.. సినిమాలో అమ్మ పాట, కబడ్డీ సీన్లు కట్ చేశారట. దీంతో ఇప్పుడు ఓటీటీ వెర్షన్లో వాటిని యాడ్ చేస్తున్నట్లు సమాచారం..ఈ వార్త విని ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇప్పటికే మహేష్ బాబు డ్యాన్స్ తో ఆదరగొట్టాడని ఇక ఇప్పుడు ఎక్సట్రా గా యాక్షన్ బ్యాక్ డ్రాప్ సీన్లు అంటే ఇక పూనకాలే అని అంటున్నారు.