NTV Telugu Site icon

Guntur Kaaram: బాబుతో అట్లుంటది మరి.. విడుదలకు ముందే ‘గుంటూరు కారం’ సరికొత్త రికార్డు!

Guntur Kaaram

Guntur Kaaram

Mahesh Babu’s Guntur Kaaram Movie USA Premieres Record: సూపర్‌స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కిన సినిమా ‘గుంటూరు కారం’. మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్‌గా విడుదల కానుంది. మహేశ్-త్రివిక్రమ్ కాంబో, మాస్ ఎంటర్‌టైనర్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అందుకు తగ్గట్టే గుంటూరు కారం సినిమా విడుదలకు ముందే సరికొత్త రికార్డు నెలకొల్పింది.

సూపర్‌స్టార్ మహేశ్ బాబుకి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. అందులోనూ బాబు దాదాపు ఏడాదిన్నర తర్వాత వెండి తెరపై కనిపించనున్నాడు. దాంతో అందరి దృష్టి గుంటూరు కారం పైనే ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ రిలీజ్ విషయంలో మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేశారు. అమెరికాలో ఏకంగా 5,408కి పైగా ప్రీమియర్ షోలు వేయనున్నారు. ఇది ఆల్ టైమ్ రికార్డ్. పాన్ ఇండియా సినిమాలు ఆర్ఆర్ఆర్‌కు 3,800కి పైగా ప్రీమియర్ షోలు వేయగా.. సలార్‌కి 2,450కి పైగా షోలు వేశారు. ఈ పాన్ ఇండియా సినిమాలతో పోలిస్తే.. తెలుగు చిత్రంకి ఈ రేంజు ప్రీమియర్ షోలు వేయడం బాబు రేంజ్ ఏంటో ఇట్లే తెలిసిపోతుంది.

Also Read: Mahesh Babu: వెకేషన్‌ కంప్లీట్.. హైద్రాబాద్‌లో ల్యాండ్ అయిన బాబు!

ప్రీమియర్ షోల ద్వారా ముందస్తు బుకింగ్స్ రూపంలో హాఫ్ మిలియన్ డాలర్స్ గుంటూరు కారంకు రానున్నాయి. లాంగ్ రన్‌లో 5-6 మిలియన్ డాలర్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో రికార్డులు బద్దలు కొట్టేలా ఉంది. ఈ సినిమా రన్ టైమ్ 159 నిమిషాలు (2 గంటల 39 నిమిషాలు) ఉంటుందట. అందులో చివరి 45 నిమిషాలు బాబు స్క్రీన్‌పై బీభత్సం చేస్తాడని రీసెంట్‌గా ప్రొడ్యూసర్ నాగ వంశీ హింట్ ఇచ్చారు. గుంటూరు కారం నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ సహా ట్రైలర్ రిలీజ్ కావాల్సి ఉండగా.. అనివార్య కారణాల వలన వాయిదా పడ్డాయి.

Show comments