సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుంది అంటే ఆ సినిమాపై ముందు నుండే భారీ స్థాయిలో అంచనాలు ఉంటాయి..సర్కారు వారి పాట వంటి సూపర్ హిట్ తర్వాత మహేష్ బాబు చేస్తున్న లేటెస్ట్ మూవీ ”గుంటూరు కారం” ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.భారీ మాస్ యాక్షన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే దాదాపు సగం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తుండగా యంగ్ బ్యూటీస్ శ్రీలీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు.. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమా నుండి ఇప్పటికే ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ అవ్వగా భారీ హైప్ ఏర్పడింది.
ఇక ఈ అప్డేట్ తర్వాత ఈ సినిమా గురించి మరో పెద్ద అప్డేట్ అనేది రాలేదు..అయితే ఈ సినిమా ఫస్ట్ సాంగ్ కోసం ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. ఎప్పటి నుండో ఈ సాంగ్ వస్తుంది అని వార్తలు వస్తూనే వున్నాయి.. కానీ మేకర్స్ నుండి ఎటువంటి రెస్పాన్స్ అయితే రాలేదు.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి ఒక పోస్టర్ బాగా వైరల్ అవుతుంది.. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుండగా ఇప్పటి నుండి కరెక్ట్ గా 100 రోజుల సమయం ఉన్నట్టు ఒక పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గుంటూరు కారం స్ట్రైక్స్ ఇన్ 100 డేస్ పోస్టర్ ప్రేక్షకుల అందరిని బాగా ఆకట్టు కుంటుంది.. మరి సంక్రాంతి కానుకగా రాబోతున్న గుంటూరు కారం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
