టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం.. ఈ సినిమాను త్రివిక్రమ్ పక్కా మాస్ అండ్ యాక్షన్ మూవీగా తెరకెక్కించారు.. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లలో రిలీజ్ అయింది.గుంటూరు కారం మూవీ పక్కా కమర్షియల్ మూవీగా తెరకెక్కింది.ఈ సినిమాలో మహేష్ బాబు ‘రమణ’ అనే ఫుల్ లెంగ్త్ మాస్ క్యారెక్టర్ చేశారు.సూపర్ స్టార్ ఈ సినిమాలో ఫైట్లు, మాస్ డ్యాన్స్‌తో విజిల్స్ వేయించారు. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. శ్రీలీల తనదైన మాస్ డాన్స్ తో అదరగొట్టింది.అలాగే గుంటూరు కారం సినిమాలో రమ్యకృష్ణ, జయరాం, జగపతి బాబు, మురళీ శర్మ, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, ఈశ్వరి రావు మరియు వెన్నెల కిశోర్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రంలో రమ్యకృష్ణమహేశ్ బాబు తల్లిగా నటించారు. వీరిద్దరి మధ్య ఎమోషనల్ సీన్లు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు.
గుంటూరు కారం మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చిన్నబాబు) నిర్మించారు. ఈ సినిమాకు ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.200కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని మూవీ టీమ్ వెల్లడించింది. ఒకే భాషలో ప్రాంతీయ మూవీగా వచ్చిన గుంటూరు కారం రికార్డులను సృష్టిస్తోందని మేకర్స్ పోస్టర్స్ ను కూడా రిలీజ్ చేసారు.అయితే ఈ సినిమాకు మొదట్లో మిక్స్డ్ టాక్ వచ్చినా ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి గుంటూరు కారం సినిమాకు మంచి స్పందన వస్తోందని నిర్మాత ఎస్.నాగవంశీ ఇటీవల మీడియా సమావేశంలో చెప్పారు. తమ సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే గుంటూరు కారం మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ప్లాట్‍ఫామ్ దక్కించుకుంది. థియేటర్లలో రిలీజ్ అయ్యాక 28 రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేసుకునేలా మూవీ టీమ్‍తో నెట్‍ఫ్లిక్స్ ఒప్పందం చేసుకుందని సమాచారం. దీంతో గుంటూరు కారం మూవీ త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్‍కు రానున్నట్లు తెలుస్తుంది