Site icon NTV Telugu

Guntur kaaram : బుక్ మై షో లో గుంటూరు కారం క్రేజ్ మాములుగా లేదుగా..

Whatsapp Image 2023 12 21 At 9.01.35 Pm

Whatsapp Image 2023 12 21 At 9.01.35 Pm

టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్‌బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం.ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ఎస్‌ఎస్‌ఎంబీ 28 గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేశ్‌ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కాంబో లో వస్తున్న సినిమా కావడం తో గుంటూరు కారం సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి.గుంటూరు కారం మూవీ లో యంగ్ బ్యూటీ శ్రీలీల మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మీనాక్షి చౌదరి సెకండ్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌ పై ఎస్‌ రాధాకృష్ణ (చినబాబు) తెరకెక్కిస్తున్నారు.

గుంటూరు కారం మూవీకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్‌.థమన్ మ్యూజిక్ మరియు బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు.గుంటూరు కారం 2024 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల లో గ్రాండ్‌ గా విడుదల కానుంది. మూవీ నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన గుంటూరు కారం మాస్ స్ట్రైక్‌.. సూపర్ స్టార్‌ అభిమానులకు ఎంతగానో నచ్చేసింది.అలాగే గుంటూరు కారం మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన దమ్‌ మసాలా సాంగ్‌ మరియు ఓ మై బేబి లిరికల్ వీడియో సాంగ్‌ మ్యూజిక్ లవర్స్‌ ను ఎంతగానో ఇంప్రెస్ చేస్తున్నాయి.ఇలా గుంటూరు కారం మూవీ విడుదల కు ముందే ఏదో ఒక అప్‌డేట్‌ తో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా మహేశ్ బాబు అభిమానులను ఖుషీ చేసే వార్త ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. పాపులర్‌ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫాం బుక్ మై షో లో గుంటూరు కారం మూవీ 100+ K ఇంట్రెస్ట్స్‌ తో ట్రెండింగ్ లో నిలుస్తోంది..మహేష్ అభిమానుల కు ఈ న్యూస్ ఎంతగానో కిక్ ఇస్తుంది.

Exit mobile version