గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. గుంటూరు పార్లమెంటు స్థానంతో పాటు ఏడు అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 13 ఉదయం ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారం ముగిసిందని.. లిక్కర్ షాపులు బంద్ అయ్యాయని అన్నారు. మరోవైపు.. ఎన్నికలు సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన కోరారు. పార్లమెంటుకు 30 మంది అసెంబ్లీలకు 130 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారని తెలిపారు. 315 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించామని చెప్పారు. 1478 పోలింగ్ స్టేషన్ లలో 79 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కెమెరాలు ఏర్పాటు చేసినట్ల పేర్కొన్నారు. పోలింగ్ పూర్తి అయ్యాక ఈవీఎంల భద్రత కోసం ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేశామని.. బయట వ్యక్తులు నియోజక వర్గాలలో ఉండటానికి కుదరదని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
Smishing Scam: మార్కెట్ లోకి కొత్త దందా.. మీ అకౌంట్ లోకి డబ్బులు వేస్తునట్లే వేసి చివరకు..
జిల్లా ఎస్పీ తుషార్ దూడి మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్నికల కోసం 11 కంపెనీల కేంద్ర బలగాలను మొహరిస్తున్నామని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. మరోవైపు.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే తీవ్ర చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి ఓటరు ఓటు హక్కు వినియోగించుకోవాలని.. ఓటు లేని బయట వ్యక్తులు జిల్లాలో ఉండటానికి వీలు లేదని చెప్పారు. అపరిచిత వ్యక్తులకు ఆశ్రయం కల్పించే ఇళ్ల యజమానులు పై కూడా చర్యలు ఉంటాయని తెలిపారు. 8500 మంది పాత నేరస్తులు కదలికల పై నిఘా పెట్టామని ఎస్పీ పేర్కొన్నారు.
Chennai Super Kings: చెన్నై ఓడిపోయినా.. ఎంఎస్ ధోనీ బాగా ఆడితే చాలు!