NTV Telugu Site icon

Pakistan: గ్వాదర్‌ పోర్ట్‌పై బలూచ్‌ మిలిటెంట్ల దాడి.. 8 మంది మృతి

Pak

Pak

పాకిస్థాన్‌లోని గ్వాదర్‌ పోర్ట్‌పై బలూచ్‌ మిలిటెంట్లు విరుచుకుపడ్డారు. సాయుధులైన బలూచ్‌ తీవ్రవాదులు గ్వాదర్‌ పోర్ట్‌ అథారిటీ కాంప్లెక్స్‌లోకి చొచ్చుకెళ్లి కాల్పులకు తెగబడ్డారు. వెంటనే పోలీసులు, భద్రతా సిబ్బంది అప్రమత్తమై సంఘటనా స్థలికి చేరుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 8 మంది తీవ్రవాదులు మరణించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పోర్ట్‌పై దాడికి పాల్పడింది తామేనని బలూచిస్థాన్‌ లిబరేషన్ ఆర్మీ ప్రకటించుకుంది. పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ తీవ్రవాదాన్ని ఏ మాత్రం సహించబోమంటూ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే ఈ ఘటన జరగింది.

పాకిస్థాన్‌లోని అతిపెద్ద ప్రావిన్స్‌గా పిలిచే బలూచిస్థాన్‌ ప్రాంతం అనేక కొండలతో కూడిన ప్రాంతం. స్వాతంత్య్రం కోసం ఇక్కడ అనేక గ్రూపులు కొన్నేళ్లుగా తిరుగుబాటు చేస్తున్నాయి. చైనా- పాకిస్థాన్‌ ఎనకమిక్‌ కారిడార్‌ ప్రాజెక్టులను ఈ గ్రూపులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా బీఎల్‌ఏ వేర్పాటువాద సంస్థ చైనా పెట్టుబడులను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బలూచిస్థాన్‌లోని గ్యాస్, ఖనిజ వనరులను చైనా, పాక్‌ దోపిడీ చేస్తున్నాయని ఆరోపిస్తోంది.

ఇది కూడా చదవండి: LSG: లోక్నోకు మరో షాక్.. ఐపీఎల్కు ఇంగ్లీష్ పేసర్ దూరం..

పాకిస్థాన్‌లోని సమస్యాత్మకమైన బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని ప్రాంతంలో పలు పేలుళ్లు సంభవించగా.. భారీ ఆయుధాలతో కూడిన బలూచ్ మిలిటెంట్లు బుధవారం గ్వాదర్ పోర్ట్ అథారిటీ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించి కాల్పులు జరిపారని మీడియా సంస్థలు తెలిపాయి. ఇదిలా ఉంటే గ్వాదర్ పోర్ట్ అథారిటీ కాంప్లెక్స్‌పై దాడిని భద్రతా బలగాలు విఫలం చేశాయి. దాడి చేసిన ఎనిమిది మందిని హతమార్చాయని మీడియా సంస్థలు పేర్కొన్నాయి.