Site icon NTV Telugu

AP Crime: మదనపల్లెలో కాల్పుల కలకలం..

Gun

Gun

AP Crime: అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలంలో నాటు తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. మండలంలోని వలసపల్లి పంచాయతీ నవోదయ కాలనీలో దివాకర్, అతని స్నేహితులతో కలిసి ఆదివారం రాత్రి ఫుల్లుగా మద్యం తాగి గొడవ పడుతున్నాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఆనంద్, అనే వ్యక్తి ఎందుకు అల్లరి చేస్తున్నారని దివాకర్‌ని ప్రశ్నించారు. వీరి మధ్య మాట పెరగడంతో ఘర్షణకు దిగారు. ఇరు వర్గాలను వారించేందుకు రెడ్డి ప్రవీణ్ అనే వ్యక్తి అక్కడికి వెళ్లి మాట్లాడుతుండగా.. దివాకర్ ఇంటికి వెళ్లి నాటు తుపాకి తీసుకొచ్చి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నాటు తుపాకీ రవ్వలు తగిలి రెడ్డిప్రవీణ్ కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రికి తరలించే చికిత్స అందిస్తున్నారు. మదనపల్లి తాలూకా పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి విచారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: CM Revanth Reddy: నేడు రాష్ట్ర నూతన గవర్నర్​ తో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ..

Exit mobile version