NTV Telugu Site icon

Gun Fire in Palnadu: పల్నాడు జిల్లాలో కాల్పుల కలకలం.. మాజీ ఎంపీపీ ఇంట్లోకి ప్రవేశించి..

Gun Fire

Gun Fire

Gun Fire in Palnadu: ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాలలో కాల్పులు కలకలం సృష్టించాయి. మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై ప్రత్యర్థులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. బాలకోటిరెడ్డి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడి అక్కడి నుంచి పారిపోయారు. గాయాలపాలైన బాలకోటిరెడ్డిని కుటుంబసభ్యులు నర్సరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Kishan Reddy: తెలుగు రాష్ట్రాలపై వివక్ష లేదు.. తిప్పికొట్టిన కేంద్రమంత్రి

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని ఈ దుశ్చర్యకు పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ప్రత్యర్థుల దాడిలో టీడీపీ మండలాధ్యక్షుడు బాలకోటిరెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి.

Show comments