NTV Telugu Site icon

Gun Fire: రాజధానిలో గన్ ఫైర్.. తుపాకీతో కాల్చుకున్న అసదుద్దీన్ ఓవైసీ వియ్యంకుడు

Gun Fire

Gun Fire

Gun Fire: హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ డాక్టర్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు స్థానికులు. కానీ అప్పటికే అతడు మృతిచెందాడు.. వివరాలు జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 12లో నివాసం ఉంటున్న మజారుద్దీన్ అనే డాక్టర్ ఈరోజు తుపాకీతో కాల్చుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు తీవ్రంగా గాయపడిన మజారుద్దీన్‌ను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి త‌ర‌లించారు. అయితే అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మజారుద్దీన్ తుదిశ్వాస విడిచారు.

Read Also: Shocking: పాము కాటుతో చనిపోయాడు.. అంత్యక్రియలు చేసిన 15ఏళ్లకు తిరిగివచ్చాడు

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మాజారుద్దీన్ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందన్న విషయం తెలియాల్సి ఉంది. ఈ ఆత్మహ‌త్య ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అయితే కుటుంబ విభేదాల నేపథ్యంలోనే మజారుద్దీన్ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక, డాక్టర్ మజారుద్దీన్.. ఎంఐఎం ఎమ్మెల్యే అసదుద్దీన్ ఒవైసీ వియ్యంకుడని సమాచారం.

Read Also: Dharmapuri Srinivas : అస్వస్థతకు గురైన డీఎస్‌.. సిటీ న్యూరో ఆసుపత్రిలో చేరిక

Show comments