Site icon NTV Telugu

Gummadi Sandhya Rani: గిరిజన ప్రాంతాల్లో తాగు నీరు, విద్య మా ప్రథమ ప్రాధాన్యం..

Gummadi Sandhyarani

Gummadi Sandhyarani

Gummadi Sandhya Rani: గిరిజన ప్రాంతాల్లో తాగునీరు, సాగునీరు, విద్య మా ప్రథమ ప్రాధాన్యం అన్నారు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి.. ఈ రోజు బాధ్యతలు స్వీకరించిన ఆమె.. తన ఛాంబర్‌లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఫొటోలు ఏర్పాటు చేశారు.. వేదమంత్రోచ్ఛారణ మధ్య గుమ్మడి సంధ్యారాణి బాధ్యతలు స్వీకరించారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గిరిజన హాస్టళ్లల్లో వర్షాలు కురిసినప్పుడు జబ్బులు బారిన పడుతున్నారు.. దీనితో ఏఎన్ఎంలను గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో వేస్తున్నాం. 544 పాఠశాలలో వారిని నియమిస్తున్నాం అన్నారు.

Read Also: Nara Lokesh: ప్రతీ పెండింగ్‌ ప్రాజెక్టును పరిశీలిస్తా.. రాష్ట్రానికి పెట్టుబడుల కోసం పనిచేస్తా..

నాకిచ్చిన శాఖలు చాలా కీలకమైనది.. శాఖలో ఇబ్బందులు మాకు తెలియజేయండి.. వాటిని పరిష్కరిస్తాను అని తెలిపారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి.. ప్రస్తుతం దగ్గర్లో వున్న ఏఎన్ఎంలను డిపుటేషన్‌పై హాస్టళ్లకు పంపుతాం అన్నారు.. ఐటీడీఏ, ఐసీడీఎస్ ల ను కచ్చితంగా ప్రక్షాళన చేస్తున్నాం. అంగన్వాడీ సమస్యలు ఒక్కొక్కటి పరిష్కారం చేస్తాం. ఇప్పుడు గిరిజన స్కూళ్లల్లో డ్రాప్ ఔట్లు ఎక్కువ అయ్యాయి. తాగునీరు, సాగునీరు, విద్యా గిరిజన ప్రాంతాల్లో మా ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. కాగా, ఏపీలో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారికి శాఖలు కేటాయించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఆ తర్వాత ఒక్కొక్కరు తమకు కేటాయించిన చాంబర్ లో బాధ్యతలు స్వీకరిస్తున్న విషయం విదితమే.

Exit mobile version