Telangana Gulf Worker Dies Mid-Flight: గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్న తెలుగు కార్మికుల గుండెలు ఆగిపోతున్న సంఘటనలు ఇటీవలి రోజుల్లో బాగా పెరుగుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు, ఏజెంట్ల మోసాలు, ఇతర కారణాలతో చాలా మంది కార్మికులు తీవ్ర ఒత్తిడికి గురై.. గుండెపోటుతో మరణిస్తున్నారు. తాజాగా మరో గల్ఫ్ కార్మికుని గుండె గాల్లోనే ఆగిపోయింది. దమ్మామ్ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఫైట్‌లోనే మరణించాడు.
Also Read: Telangana Rains: తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు!
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన శ్రీరాముల శ్రీధర్ కొన్నాళ్లుగా సౌదీ అరేబియాలోని దమ్మామ్ నగరంలో పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి దమ్మామ్ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఫైట్‌లో శ్రీధర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. శ్వాస ఆడటం లేదని ఫ్లైట్ సిబ్బందికి తెలియజేయగా.. ముంబైలో విమానంను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. సీపీఆర్ చేసినా ఎలాంటి చలనం లేకపోవడంతో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతునికి భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. శ్రీధర్ మృతితో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నేడు మృతదేహం కోరుట్లకు చేరుకోనుంది.
