Site icon NTV Telugu

GT vs DC : ఢిల్లీపై గుజరాత్‌ విజయం

Gt

Gt

ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్‌తో ఢీ కొట్టింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. గుజరాత్‌కు 163 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఢిల్లీ కెప్టెన్ డేవిడ్‌ వార్నర్‌ 37, సర్ఫరాజ్‌ ఖాన్‌ 30 పరుగులు చేయగా.. చివర్లో అక్షర్‌ పటేల్‌ 22 బంతుల్లో 36 పరుగులు చేసి ఢిల్లీ క్యాపిటల్స్‌ 160 పరుగుల మార్క్‌ అందుకునేలా చేశాడు. గుజరాత్‌ బౌలర్లలో షమీ, రషీద్‌ ఖాన్‌లు చెరో మూడు వికెట్లు తీయగా.. అల్జారీ జోసెఫ్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.

Also Read : Allu Sneha Reddy: హీరోయిన్లు కూడా బన్నీ భార్య ముందు దిగదుడుపే..

ఢిల్లీ క్యాపిటల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 10 ఓవర్లలో 3 మూడు కీలక వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేయగలిగింది. ఆ తరువాత.. సాయి సుదర్శన్‌ 48 బంతుల్లో 62 పరుగులతో నాటౌట్‌ ఆఖరి వరకు నిలిచి జట్టును గెలిపించాడు. అతనికి డేవిడ్‌ మిల్లర్‌(16 బంతుల్లో 31 పరుగులు నాటౌట్‌), విజయ్‌ శంకర్‌(23 బంతుల్లో 29 పరుగులు) సహకరించారు. ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లలో నోర్ట్జే రెండు వికెట్లు తీయగా.. ఖలీల్‌ అహ్మద్‌, మిచెల్‌ మార్ష్‌లు తలా ఒక వికెట్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు.

Also Read : Cop Kills Family: సర్వీస్‌ రివాల్వర్‌తో భార్య, కొడుకు, పెంపుడు కుక్కను చంపి.. తర్వాత..

Exit mobile version