IPL 2025: చితక్కొట్టిన GT ఓపెనర్లు.. 3 జట్లకు ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫార్మ్
- ఢిల్లీపై గుజరాత్ విజయం
- 3 జట్లకు ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫార్మ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డూ ఆర్ డై మ్యాచ్‌లో ఢిల్లీపై గుజరాత్ విజయం సాధించింది. ఢిల్లీ ఇచ్చిన 200 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ మరో ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. సుదర్శన్ సెంచరీతో ఢిల్లీ బౌలర్లను ఉతికారేశాడు. మరో ఎండ్ లో కెప్టెన్ శుభ్ మన్ గిల్ సూపర్ నాక్ ఆడాడు. అటు కేఎల్ రాహుల్ సెంచరీ వృధా అయిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 112 పరుగులు చేశాడు. 35 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసిన కేఎల్.. ఫిఫ్టీ నుంచి 90లలోకి రావడానికి రాహుల్ 16 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. అంటే అతని విధ్వంసం ఏవిధంగా సాగిందో అర్ధం చేసుకోవచ్చు.
Also Read:Health Tips: పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా?.. ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
Also Read
ఐపీఎల్లో రాహుల్ కిది ఐదో సెంచరీ. ఇక భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన గుజరాత్ ఓపెనర్లు ఢిల్లీ బౌలర్లను చీల్చిచెండాడారు. గిల్ కాస్త నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటికీ, సాయి సుదర్శన్ ఆరంభం నుంచే దూకుడు కొనసాగించాడు. ఫోర్లు సిక్సర్లతో మోత మోగించాడు. సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు నమోదయ్యాయి. గిల్ 3 ఫోర్లు, 7 సిక్సర్లతో మైదానాన్ని హోరెత్తించాడు. ఈ విజయంతో గుజరాత్ ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది. అంతేకాదు ఈ సీజన్లో ప్లేఆఫ్స్ చేరిన తొలి జట్టుగా నిలిచింది.
Also Read:Gold Rates: పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. నేడు మళ్లీ పెరిగినయ్
ఇక ఢిల్లీ ఓటమితో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు , పంజాబ్ కింగ్స్ కూడా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. ఢిల్లీకి ఇంకా ప్లేఆప్స్ అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఢిల్లీ 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో పాయింట్స్ టేబుల్లో ఐదో స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన చివరి రెండు మ్యాచ్‌ల్లో ఢిల్లీ విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ చేరుతుంది. ఒక్క మ్యాచ్ ఓడినా ఇంటికి పయనమవ్వాల్సిందే. ఇక మిగిలిన ఒక స్థానానికి ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ పోటీ పడుతున్నాయి. ఈ మూడు జట్లలో ఒక జట్టుకు మాత్రమే ప్లేఆప్స్ కు ఛాన్స్ ఉంటుంది.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!