Site icon NTV Telugu

IPL 2025: చితక్కొట్టిన GT ఓపెనర్లు.. 3 జట్లకు ప్లేఆఫ్స్ బెర్త్ క‌న్ఫార్మ్

Gt

Gt

డూ ఆర్ డై మ్యాచ్‌లో ఢిల్లీపై గుజరాత్ విజయం సాధించింది. ఢిల్లీ ఇచ్చిన 200 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ మరో ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. సుదర్శన్ సెంచరీతో ఢిల్లీ బౌలర్లను ఉతికారేశాడు. మరో ఎండ్ లో కెప్టెన్ శుభ్ మ‌న్ గిల్ సూప‌ర్ నాక్ ఆడాడు. అటు కేఎల్ రాహుల్ సెంచ‌రీ వృధా అయిపోయింది. ఢిల్లీ క్యాపిట‌ల్స్ 20 ఓవ‌ర్లలో 3 వికెట్లు కోల్పోయి 199 ప‌రుగులు చేసింది. కేఎల్ రాహుల్ 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 112 పరుగులు చేశాడు. 35 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసిన కేఎల్.. ఫిఫ్టీ నుంచి 90లలోకి రావడానికి రాహుల్ 16 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. అంటే అతని విధ్వంసం ఏవిధంగా సాగిందో అర్ధం చేసుకోవచ్చు.

Also Read:Health Tips: పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా?.. ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

ఐపీఎల్‌లో రాహుల్ కిది ఐదో సెంచరీ. ఇక భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన గుజరాత్ ఓపెనర్లు ఢిల్లీ బౌలర్లను చీల్చిచెండాడారు. గిల్ కాస్త నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటికీ, సాయి సుదర్శన్ ఆరంభం నుంచే దూకుడు కొనసాగించాడు. ఫోర్లు సిక్సర్లతో మోత మోగించాడు. సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు నమోదయ్యాయి. గిల్ 3 ఫోర్లు, 7 సిక్సర్లతో మైదానాన్ని హోరెత్తించాడు. ఈ విజ‌యంతో గుజ‌రాత్ ప్లేఆఫ్స్ బెర్త్ క‌న్ఫార్మ్ చేసుకుంది. అంతేకాదు ఈ సీజ‌న్‌లో ప్లేఆఫ్స్ చేరిన తొలి జ‌ట్టుగా నిలిచింది.

Also Read:Gold Rates: పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. నేడు మళ్లీ పెరిగినయ్

ఇక ఢిల్లీ ఓట‌మితో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు , పంజాబ్ కింగ్స్ కూడా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. ఢిల్లీకి ఇంకా ప్లేఆప్స్ అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఢిల్లీ 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో ఐదో స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన చివరి రెండు మ్యాచ్‌ల్లో ఢిల్లీ విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ చేరుతుంది. ఒక్క మ్యాచ్ ఓడినా ఇంటికి పయనమవ్వాల్సిందే. ఇక మిగిలిన ఒక స్థానానికి ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ పోటీ పడుతున్నాయి. ఈ మూడు జట్లలో ఒక జట్టుకు మాత్రమే ప్లేఆప్స్ కు ఛాన్స్ ఉంటుంది.

Exit mobile version