Site icon NTV Telugu

Lizard In Ice cream: ఐస్ క్రీంలో బల్లి తోక.. దుకాణం సీజ్, కంపెనీకి రూ.50,000 జరిమానా..!

Ice Cream Lizard Copy

Ice Cream Lizard Copy

Lizard In Ice cream: అహ్మదాబాద్‌లోని ఓ మహిళకు ఐస్ క్రీం తినడం ఓ పీడకలగా మారింది. ఎందుకంటే, ఆమె కొనుగోలు చేసిన ఐస్‌క్రీమ్‌లో బల్లి తోక కనిపించింది. ఈ ఘటన గుజరాత్‌ లోని అహ్మదాబాద్ నగరంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళితే..

Read Also: Vivo V50 Elite Edition: రూ.1899 విలువ చేసే ఇయర్‌బడ్స్ ఉచితంగా అందిస్తూ భారత్ లో వివో V50 ఎలైట్ ఎడిషన్ విడుదల..!

ఈ సంఘటన ఎదురుకున్న మహిళ చెప్పిన వివరాల ప్రకారం.. ఆమె తన పిల్లల కోసం ‘హవ్మోర్’ (Havmor) బ్రాండ్‌కి చెందిన నాలుగు ఐస్‌క్రీమ్ కోన్లు మణినగర్ ప్రాంతంలోని మహాలక్ష్మి కార్నర్ అనే దుకాణంలో కొనుగోలు చేశారు. అయితే ఐస్‌క్రీమ్‌ను సగం తిన్న తరువాత ఆమెకు అందులో బల్లి తోక భాగం కనిపించింది. అయితే, ఈ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ఆమెకు తీవ్రమైన కుడుపు నొప్పి, విరేచనాలు అవ్వడం జరిగింది. దానితో వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోహ్యం కుదుటపడలేదని సమాచారం.

ఈ ఘటన సమయంలో తీసిన వీడియోలో మహిళ మాట్లాడుతూ.. తాము నాలుగు కోన్లు కొనుగోలు చేశామని, వాటిలో ఒక దానిలో ఇది కనిపించింది అంటూ బల్లి తోకను చూపించారు. దీన్ని తర్వాత నాకు ఎక్కువగా విరేచనాలు వస్తున్నాయని, అదృష్టవశాత్తూ నా పిల్లలు దీన్ని తినలేదని ఆమె వివరించారు. ఏమన్నా జరిగితే కంపెనీపై కేసు వేస్తాం. దయచేసి ఏదైనా తినే ముందు సరైన రీతిలో పరిశీలించండి అంటూ బాధితురాలు తెలిపింది.

Read Also: Royal Enfield Flying Flea: బండి కిరాక్‌గా ఉందిగా.. ఈవీ రంగంలోకి అడుగుపెట్టబోతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్..!

ఈ ఘటనపై మహిళ అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌కు ఫిర్యాదు చేయడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. పరిశీలనలో భాగంగా, ఐస్‌క్రీమ్ కొనుగోలు చేసిన మహాలక్ష్మి కార్నర్‌కు ఫుడ్ సేఫ్టీ యాక్ట్ కింద లైసెన్స్ లేదని తేలింది. దీంతో దుకాణాన్ని అధికారులు తక్షణమే మూసివేశారు. అలాగే అధికారుల దర్యాప్తులో బల్లి తోక భాగం ఉన్న ఐస్‌క్రీమ్ కోన్ హవ్మోర్ ఐస్‌క్రీమ్ ప్రైవేట్ లిమిటెడ్, నరోడా GIDC ఫేజ్ 1లో తయారైనదిగా గుర్తించారు. ప్రస్తుతం ఆ బ్యాచ్‌కు సంబంధించిన ఐస్‌క్రీమ్ నమూనాలను పరీక్షకు పంపారు. కంపెనీకి కూడా ఆ బ్యాచ్‌ను మార్కెట్ నుంచి వెనక్కు తీసుకోవాలని నోటీసులు జారీ చేశారు. అంతేకాదు కంపెనీపై రూ. 50,000 జరిమానా విధించారు కూడా.

Exit mobile version